యుఎస్‌డీ 19.4 బిలియన్ మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్ ఇప్పుడు నూతన వినియోగదారుల లక్ష్యిత కార్యక్రమం ఎం-ప్రొటెక్ట్ కోవిడ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. దీనిద్వారా ఈ కష్టకాలంలో భారతీయ రైతులకు మద్దతునందించనుంది.
మహీంద్రా యొక్క ఎం-ప్రొటెక్ట్ ప్లాన్‌ను నూతన మహీంద్రా ట్రాక్టర్ వినియోగదారులతో పాటుగా వారి కుటుంబసభ్యులను కోవిడ్ 19 బారి నుంచి కాపాడటమే లక్ష్యంగా విడుదల చేశారు. ఈ ఎం-ప్రొటెక్ట్ కోవిడ్ ప్లాన్ ద్వారా మహీంద్రా తమ వినియోగదారులకు వినూత్నమైన మెడిక్లెయిమ్ పాలసీ ద్వారా ఒక లక్ష రూపాయల ఆరోగ్య బీమాను హోమ్ క్వారంటైన్ ప్రయోజనాలతో పాటుగా అందించనుంది. అలాగే కోవిడ్ 19 చికిత్స సమయంలో ఎదురయ్యే ఖర్చులకు మద్దతునందిస్తూ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ సైతం అందించనున్నారు. ఒకవేళ దురదృష్టవశాత్తు వినియోగదారులు మరణించిన ఎడల వారి ఋణాలకు మహీంద్రా లోన్ సురక్షణ కింద బీమా చేయనున్నారు.
మే 2021లో కొనుగోలు చేసిన మహీంద్రా మొత్తం శ్రేణి ట్రాక్టర్లపై ఈ ఎం-ప్రొటెక్ట్ కోవిడ్ ప్లాన్ లభ్యం కానుంది. ఈ ప్లాన్ గురించి ఎంఅండ్‌ఎం లిమిటెడ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్ అధ్యక్షులు హేమంత్ సిక్కా మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంలో సహాయపడే రీతిలో మా వినియోగదారులు, కమ్యూనిటీ కోసం పలు కార్యక్రమాలను మహీంద్రా వద్ద ప్రారంభించాం. ఆ దిశగా రైతుల కోసం ప్రారంభించిన మా నూతన కార్యక్రమం ఎం-ప్రొటెక్ట్ కోవిడ్ ప్లాన్. దీనితో కోవిడ్ సంబంధిత ప్రభావం తగ్గించేందుకు మద్దతునందించనున్నాం. దీనితో మా రైతులు ఆరోగ్యవంతమైన జీవితం కొనసాగించగలరని ఆశిస్తున్నాం అని అన్నారు.
ఎం అండ్ ఎం లిమిటెడ్ ఫార్మ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శుభబ్రాతా సాహా మాట్లాడుతూ, రైతు సమాజానికి మే, జూన్ నెలలు అత్యంత కీలకమైనవి. కోవిడ్ 19 ఇప్పుడు వారికి పలు సవాళ్లను తీసుకువచ్చింది. ఈ ఎం- ప్రొటెక్ట్ ప్లాన్ ద్వారా ఆరోగ్య, ఆర్థిక, బీమా సంబంధిత రక్షణను రైతులకు ఈ సంక్షోభ సమయంలో అందించనున్నాం. తద్వారా వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులను సైతం కాపాడగలం అని అన్నారు.