Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూల్స్ అతిక్రమిస్తే రామనామం రాయాల్సిందే... ఎక్కడ?

Advertiesment
రూల్స్ అతిక్రమిస్తే రామనామం రాయాల్సిందే... ఎక్కడ?
, ఆదివారం, 16 మే 2021 (13:14 IST)
దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తుండ‌టంతో దేశంలోని ప‌లు రాష్ట్రాలు నైట్ క‌ర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు అమ‌లు చేస్తున్నాయి. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిస్తున్నాయి. 
 
అయినా నిత్యం ఎంతో మంది నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉల్లంఘ‌నుల‌కు పోలీసులు విధించే శిక్ష‌లు వినూత్నంగా ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉల్లంఘ‌నులతో పోలీసులు గుంజీలు తీయిస్తే, మ‌రికొన్ని ప్రాంతాల్లో క‌ప్ప‌గంతులు వేయిస్తున్నారు. 
 
తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాత్నా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా వినూత్న ప‌ద్ధతిలో ఉల్లంఘ‌నుల‌ను శిక్షిస్తున్న‌ది. నిబంధ‌న‌లు లెక్క‌చేయ‌కుండా అన‌వ‌స‌రంగా బ‌య‌టికి వ‌చ్చిన వారితో అక్క‌డి పోలీసులు రామనామం రాయిస్తున్నారు. ఉల్లంఘ‌నుల చేతికి ఒక డెయిరీ ఇచ్చి పేజీ నిండా రామ రామ అని రాయ‌మంటున్నారు.
 
కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో పంజాబ్‌లో క‌రోనా కేసుల‌తోపాటు మ‌ర‌ణాలు భారీగా న‌మోద‌వుతున్నాయి. కేవ‌లం 44 రోజుల్లోనే మొత్తం మ‌ర‌ణాల్లో 40 శాతం న‌మోద‌య్యాయంటే క‌రోనా ఉధృతి ఎంత‌గా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 
 
పంజాబ్‌లో మార్చి 31 నాటికి 6868 మంది బాధితులు మ‌ర‌ణించారు. మే 14 నాటికి ఆ సంఖ్య 11,477కు చేరింది. అంటే 44 రోజుల్లో 4609 మంది మృతిచెందారు. రాష్ట్రంలో గ‌త కొన్నిరోజులుగా ప్ర‌తిరోజు వంద మందికిపైగా క‌న్నుమూస్తున్నారు. మే 11న ఒకేరోజు 217 మంది చ‌నిపోయారు. 
 
మార్చి 31 నాటికి 2,39,734 కేసులు ఉండ‌గా, మే 14 నాటికి ఆసంఖ్య 4,83,984కు పెరిగింది. పంజాబ్‌లో లూథియానాలో అత్య‌ధికంగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మే 14 మ‌ధ్య జిల్లాలో 538 మంది మ‌ర‌ణించ‌గా, అమృత్‌స‌ర్‌లో 515 మంది బాధితులు మృతిచెందారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కాటుకు ప్రాణాలు విడిచిన కాంగ్రెస్ ఎంపీ - ప్రధాని సంతాపం