Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త కనెక్షన్లతో మరింత చిన్నగా మారిన ప్రపంచం ఓపెన్ డోర్స్‌ ఆవిష్కరించిన ట్రూకాలర్‌

Advertiesment
open doors
, బుధవారం, 13 జులై 2022 (23:22 IST)
సురక్షితమైన, భద్రమైన, వ్యక్తిగతమైన ఆడియో సంభాషణల కోసం సరికొత్త అంతర్జాతీయ కమ్యూనికేషన్స్‌ వేదిక ఓపెన్ డోర్స్‌ను ట్రూకాలర్‌ నేడు ఆవిష్కరించింది. స్టాక్‌హోమ్‌, ఇండియాలోని ప్రత్యేక బృందం ఎన్నో నెలల కృషికి ఫలితం ఈ యాప్‌.


డిజిటల్ జీవితాల్లో వ్యక్తులను రక్షించడం, వ్యక్తిగత భద్రత కోసం ఉచిత సంరక్ష యాప్‌గా నిలుస్తున్న ట్రూకాలర్‌ను రూపొందించిన స్వీడిష్‌ కంపెనీ ఇప్పుడు సరికొత్త లక్ష్యం- సరదా, అప్రయత్న పనులు, అంతర్జాతీయ సంభాషణలపై దృష్టి సారించింది. పూర్తిగా ఉచితంగా లభించే ఓపెన్ డోర్స్‌ ఇప్పుడు గూగుల్‌ ప్లే స్టోర్స్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్స్‌ ద్వారా అంతర్జాతీయంగా అందుబాటులో ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్‌ వేదికల్లో ఈ యాప్ ఎటువంటి అంతరాయం లేకుండా పనిచేస్తుంది.

 
"వ్యాపారంలో 13 సంవత్సరాలుగా ట్రూకాలర్ ఉన్నందుకు ధన్యవాదాలు. ప్రజలు ఎలా కమ్యూనికేట్ చేస్తారో తెలుసుకునేందుకు మేము చాలా సమయం వెచ్చించాము” అన్నారు ట్రూ సాఫ్ట్‌వేర్ స్కాండినేవియా ఏబీ సహ వ్యవస్థాపకుడు నమీ జరింఘాలమ్. ‘చొరబడకుండా కొత్త కనెక్షన్లు పొందడంలో మనం ఎలా సాయపడగలం? అనే ఒక సాధారణ ప్రశ్న నుంచి పుట్టిన కొత్త యాప్ ఓపెన్ డోర్స్. ఇదే మేము చేయాలనుకున్నాం. కమ్యూనికేషన్ అత్యంత సహజమైన కమ్యూనికేషన్‌ రూపాన్ని మన స్వరాలు ఉపయోగించి ప్రపంచానికి వారధి నిర్మించాలనుకున్నాం.”

 
ఓపెన్ డోర్స్ ఎలా పని చేస్తుంది:
ఓపెన్ డోర్స్‌ను చాలా సులభంగా అందిపుచ్చుకోవచ్చు. మీరు ఇప్పటికే ట్రూకాల్‌ యూజర్‌ అయి ఉంటే కేవలం ఒక ట్యాప్‌తో సైన్ ఇన్ కావచ్చు మీరు ట్రూకాలర్‌ యూజర్‌ కానట్టు అయితే మిస్డ్ కాల్ లేదా ఓటీపీ ద్వారా మీ ఫోన్‌ నెంబర్‌ ధృవీకరించడం జరుగుతుంది. ఈ యాప్‌కు కేవలం రెండు అనుమతులు మాత్రమే అవసరం: కాంటాక్ట్స్ (తద్వారా మీరు ఓపెన్ డోర్స్‌ను షేర్ చేయవచ్చు లేదా ఓపెన్ డోర్స్ ఉన్న మీ కాంటాక్ట్స్‌లోని వ్యక్తులతో కనెక్ట్ అవ్వవచ్చు), ఫోన్ అనుమతి (ఆడియో సంభాషణల కోసం అవసరం). మాట్లాడుకునేవారు ఒకరి ఫోన్ నంబర్‌ మరొకరు చూడలేరు.

 
ఓపెన్ డోర్స్ యూజర్‌గా మీరు అన్ని వేళలా పూర్తి నియంత్రణలో ఉంటారు. మీకు నచ్చినప్పుడు  సంభాషణ ప్రారంభించవచ్చు, ఇష్టానుసారం ఆపేయవచ్చు. నోటిఫికేషన్‌ అందుకున్నప్పుడు లేదా మీరు పంపిన లింక్‌ క్లిక్‌ చేయడం ద్వారా మీ స్నేహితులు మీ సంభాషణలో పాలుపంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ఇంటర్‌ఫేస్ ఇంగ్లిష్, హిందీ, స్పానిష్, లాటిన్, ఫ్రెంచ్ భాషలలోనే అందుబాటులో ఉంది.  యూజర్ డిమాండ్‌పై మరిన్ని భాషలు చేర్చడం జరుగుతుంది.

 
మీ స్నేహితుడు సంభాషణలో చేరిన తర్వాత, వారు వారి స్నేహితులు కూడా ఆహ్వానించవచ్చు. నెట్‌వర్క్ ప్రభావం ద్వారా మీరు అతి త్వరలో పెద్ద సంఖ్యతో కూడిన వ్యక్తులతో చేరవచ్చు. ట్రూకాలర్‌ లాగానే సంభాషణలు రియల్‌ టైమ్‌లో జరుగుతాయని, అవి కమ్యూనిటీ ద్వారా నియంత్రించబడతాయని  గుర్తుంచుకోండి. అవి ఎక్కడా స్టోర్‌ కావు, మీకు తెలియకుండా ఎవరు కూడా వాటిని వినలేరు. పాల్గొనేవారు సురక్షితమైన, సమిష్టితత్వంతో కూడిన గౌరవప్రదమైన వాతావరణంలో సంభాషణలు సాగిస్తారని మేము ఆశిస్తున్నాము.

 
యూజర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మేము ఓపెన్ డోర్స్‌కి మరిన్ని ఫీచర్లు జోడిస్తూనే ఉంటాము. కొద్ది మందితో కూడిన బేటా టెస్టర్‌ గ్రూప్‌ ద్వారా ఇప్పటికే కొన్ని ఆవిష్కరణలపై పనులు జరుగుతున్నాయి. వీటి ద్వారా కాంటాక్ట్స్‌లో సన్నిహిత బంధం (మీరు సంభాషణ ప్రారంభించినప్పుడు మీ కాంటాక్ట్స్‌లో ఓపెన్‌ డోర్స్‌ కలిగిన వారు నోటిఫికేషన్‌ అన్ని వేళలా పొందకుండా చూడటం) కలిగిన వ్యక్తులకు  ప్రతిస్పందించే సామర్థ్యం అందించడంతో పాటు కొత్త సంభాషణలు ప్రారంభించేటప్పుడు యాప్‌ నోటిఫికేషన్‌పై కచ్చితమైన నియంత్రణను ఇది అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2022 జూన్‌లో హైదరాబాద్‌లో రిజిష్టరైన 5,408 అపార్ట్‌మెంట్లు: నైట్ ఫ్రాంక్ ఇండియా