Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా దృఢంగా నిలుస్తుంది ట్రూకాలర్

Advertiesment
మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా దృఢంగా నిలుస్తుంది ట్రూకాలర్
, సోమవారం, 7 మార్చి 2022 (23:10 IST)
సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు మన నిత్యజీవితంలో ఒక ముఖ్యమైన భాగం కావడంతో ప్రపంచం కూడా డిజిటల్‌ దిశగా కదులుతోంది. ఇవి లేకుండా 21వ శతాబ్దంలో జీవితాన్ని ఊహించడం సులభం కాదు. అటు పెరుగుతున్న డిజిటైజేషన్ కారణంగా మహిళలపై ఆన్‌లైన్‌ దూషణలు పెరుగుతున్నాయి. ఏర్పడిన నాటి నుంచి స్థిరంగా సాగుతున్న ట్రూకాలర్‌, సురక్షితమైన, సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ నిర్మించి సమాజానికి సాయపడేందుకు ప్రయత్నిస్తోంది.

 
ట్రూకాలర్ ఉపయోగం రోజువారీ జీవితంలో అనవసరమైన కమ్యూనికేషన్‌ను బ్లాక్‌ చేయడంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సాయపడుతోంది. మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా దృఢంగా నిలుస్తుంది ట్రూకాలర్‌. అంతే కాదు ప్రతీ ఒక్కరికీ కమ్యూనికేషన్ అన్నది సురక్షితంగా, మరింత సమర్థవంతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. ఐదేళ్ల క్రితం ఐదు దేశాల్లో లోతైన పరిశోధన చేసి మహిళల కోసం మొదలుపెట్టిన #ItsNotOk ప్రచారం ద్వారా ఆన్‌లైన్ వేధింపులకు వ్యతిరేకంగా అవగాహన కల్పించే ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది.

 
ప్రపంచ సైబర్ భద్రత అవసరాలకు అనుగుణంగా ఉండటమే కాదు సైబర్ స్వచ్ఛత ప్రాముఖ్యతను గుర్తిస్తూ ట్రూకాలర్ ఈ సంవత్సరం మరో  అడుగు ముందుకు వేసింది. ఫోన్‌/ఎస్‌ఎంఎస్‌ వేధింపులకు వ్యతిరేకంగా మహిళలు తమ స్వరాన్ని వినిపించేలా ప్రోత్సహించేందుకు #Itsnotok- Callitout మొదలుపెట్టింది. వేధింపులు సాధారణమే అన్న ప్రస్తుత ధోరణికి సవాల్‌ విసురుతూ అవసరమైన సమయంలో మహిళలకు అండగా నిలవడం ఈ ప్రచార లక్ష్యం. ఈ చర్యలకు చేయూత అందించేందుకు సైబర్‌ పీస్‌  ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో సైబర్‌ సేఫ్టీ ప్రోగ్రామ్‌ను ట్రూకాలర్‌ ప్రారంభించింది. దీని ద్వారా మొదటి దశలో 15 లక్షల మంది మహిళలకు శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యం.

 
ఈ ప్రచారం గురించి ట్రూకాలర్‌ ఇండియా చీఫ్‌ ప్రొడక్ట్ ఆఫీసర్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌ రిషిత్‌ ఝుంఝున్‌వాలా మాట్లాడుతూ, “ ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా తమ అద్భుతమైన పనులతో భవిష్యత్‌ తరాలకు దారులు ఏర్పాటు చేసిన గొప్ప మహిళామణులు జ్ఞప్తికి వస్తారు. మహిళలు నిర్భయంగా, భవిష్యత్‌ వైపు చూసేలా మహిళల పట్ల మన బాధ్యతను వారు మరింత గుర్తు చేస్తారు.

 
మొబైల్‌ ఫోన్ల ద్వారా మహిళలు ఎదుర్కొనే వేధింపులపై అవగాహన కల్పించేందుకు అలాగే ప్రస్తుత సందర్భంలో వేధింపులు సాధారణమనే భావనను సవాల్‌ చేసే లక్ష్యంతో #ItsNotOk ప్రచారాన్ని ట్రూకాలర్‌ ప్రారంభించింది. మేము మీకు అండగా ఉంటాం, అలాగే అవసరమైన సందర్బంలో ఒక చేయూత అందించేలా నిలుస్తామని మహిళలందరికీ నేను చెప్పదలిచాను, కాబట్టి, మౌనంగా కుమిలిపోకండి, అడుగు వేయండి, ఫిర్యాదు చేయండి.  మా ప్రచారంలో భాగంగా నిలిచి వేధింపులకు వ్యతిరేకంగా నిలబడండి. ఈ చిన్న చర్యలు సమాజాన్ని సురక్షితంగా నిలిపేలా చూడటంలో ఎంతో దోహదపడతాయి.

 
#ItsNotOkay- Callitout అనే ఈ ప్రచార లక్ష్యం ఫోన్ వేధింపుల నుంచి మహిళలను రక్షించి వారు మాట్లాడేలా ప్రోత్సహించడం. రోజు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకమైన వేధింపులను మహిళలు ఎదుర్కోవడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఇందులో అనుచిత టెక్ట్స్‌ మెసేజ్‌లు, వేధింపు కాల్స్ కూడా ఉన్నాయి. భారతదేశంలో నేడు మహిళ జనాభా 50%గా ఉంది. వేధింపుల గురించి వారు మాట్లాడి ఆ సమస్యపై చర్యలు తీసుకునేలా మార్పు తీసుకురావడం చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకొని మహిళలు బయటి చెప్పేలా చూసి, వేధింపులపై తగిన చర్యలు తీసుకునేలా చూసేందుకు  #ItsNotOkay- CallItOut ప్రచారాన్ని మేము మరింత ముందుకు తీసుకెళ్తున్నాం.

 
మహిళలు, వ్యక్తిగత భద్రత అనేవి ట్రూకాలర్‌కు ముఖ్యమైన విషయాలు. ఈ దిశగా సానుకూల మార్పు తీసుకువచ్చేందుకుస, ఆన్‌లైన్‌ వేధింపులను ఎదుర్కొనేందుకు ప్రథమ శ్రేణి రక్షణగా నిలిచేందుకు తన కృషిని ఈ బ్రాండ్‌ కొనసాగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడలిని లోబరుచుకునేందుకు హింసించిన మామ, చివరికి...