Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డీసీడబ్ల్యూ 181 ఉమెన్ హెల్ప్‌లైన్‌ అందుబాటులో సాయపడుతున్న ట్రూకాల్‌ యాప్‌

Advertiesment
డీసీడబ్ల్యూ 181 ఉమెన్ హెల్ప్‌లైన్‌ అందుబాటులో సాయపడుతున్న ట్రూకాల్‌ యాప్‌
, బుధవారం, 11 మే 2022 (21:13 IST)
ట్రూకాలర్‌ యాప్‌లోని క్విక్‌ డయల్‌ ఫీచర్‌తో 181 ఉమెన్స్‌ హెల్ప్‌ లైన్‌ను అనుసంధానం చేయడంతో ఢిల్లీ కమీషన్ ఫర్ ఉమెన్స్ హెల్ప్‌లైన్ 181కు వచ్చే కాల్స్ సంఖ్య 200% ఎక్కువ అందుకుంది. ఈ సంవత్సరం మార్చి నుంచి మహిళలు, బాలికలపై నేరాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రచారం #ItsNotOkలో భాగంగా ట్రూకాలర్‌ మహిళా భద్రతా హెల్ప్‌లైన్‌ నెంబర్ -181ని తన డయలర్‌లో ప్రదర్శించడం ప్రారంభించింది.

 
ట్రూకాలర్ డయలర్‌లో మహిళా హెల్ప్‌లైన్ 181 ప్రముఖంగా కనిపించడంతో ఢిల్లీలోని ఢిల్లీ మహిళా కమిషన్‌ హెల్ప్‌లైన్‌కు వస్తున్న కాల్స్ సంఖ్య భారీగా పెరిగింది. ట్రూకాలర్‌తో అనుసంధానం ఏర్పడక ముందు కమిషన్ హెల్ప్‌లైన్‌ 181కి రోజు దాదాపు 2000 కాల్‌లు వచ్చేవి, ఈ సంఖ్య ఇప్పుడు రోజుకు 4,000 కంటే ఎక్కువకు అంటే 200% అధికంగా పెరిగాయి. 181 ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ గురించి తెలుసుకునేందుకు, మహిళలు, బాలికల రక్షణలో దాని పాత్ర గురించి తెలుసుకునేందుకు మార్చిలో 65.5 వేల కాల్స్ వచ్చాయి.

 
గృహ హింస, లైంగిక వేధింపులు, మహిళలపై జరిగే ఇతర నేరాలకు సంబంధించిన కేసుల్లో ఢిల్లీలోని మహిళలు, బాలికలు 181 ఉమెన్‌ హెల్ప్‌లైన్ నుంచి సాయం కోరుతున్నాయి. ప్రతీ కేసులో పనిచేసే కమిషన్ ఈ ప్రక్రియ ద్వారా వందలాది మంది మహిళలు, బాలికలకు సాయం చేస్తోంది.

 
ఉదాహరణకు, ఏప్రిల్ 2022లో 181 మహిళా హెల్ప్‌లైన్‌కు ఒక మహిళ సోదరుడి నుంచి కాల్ వచ్చింది. తన సోదరి ఛత్తీస్‌గఢ్‌లోని ఆమె అత్తారింట బందీగా ఉందని, ఆమె భర్త ప్రతీ రోజు ఆమెను కొడుతున్నాడని సమాచారం అందించాడు. వెంటనే, 181 మహిళా హెల్ప్‌లైన్ బృందం ఛత్తీస్‌గఢ్‌లోని సీనియర్ పోలీసు అధికారులతో మాట్లాడి ఆ మహిళను వారు సురక్షితంగా కాపాడేంత వరకు ఫాలో అప్ చేస్తూనే ఉంది. ఆ మహిళ ఇప్పుడు ఢిల్లీలోని తన పుట్టింటికి చేరుకుంది.

 
ట్రూకాలర్ పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ శ్రీమతి ప్రజ్ఞా మిశ్రా మాట్లాడుతూ, “కాల్స్, ఎస్‌ఎంఎస్ ఆధారిత వేధింపులకు వ్యతిరేకంగా నేడు భారతదేశంలో 10 కోట్ల మంది మహిళలు మొదటి రక్షణ కవచంగా ట్రూకాలర్‌ ఉపయోగిస్తున్నారు. అత్యవసర సమయాల్లో 181 ఉమెన్‌ హెల్ప్‌లైన్ నెంబర్‌ ఒక క్లిక్ ద్వారా అందుబాటులో ఉంచేలా ట్రూకాలర్‌ డయలర్‌లో అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌ను పిన్ చేయడం మా వినియోగదారులను సురక్షితంగా ఉంచడంలో  మరొక దశ.

 
భారతదేశంలోని మా 220 మిలియన్ల వినియోగదారులలో దాదాపు 2.45 మిలియన్ల మంది గడిచిన 45 రోజుల్లో  ట్రూకాలర్‌ నుంచి హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 181కు 4.21 మిలియన్ కాల్స్ చేశారు. వేధింపులను ఎదుర్కోవడానికి, కాల్ చేయడానికి వారు తీసుకోగల చర్యలపై అవగాహన కల్పించడం ద్వారా మహిళలు సాధికారత సాధించాలనే మా ప్రయత్నం ఇది” అన్నారు.

 
శ్రీమతి స్వాతి మాలివాల్, ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ఈ కృషిని ప్రయత్నిస్తూ, “ట్రూకాలర్ చేపట్టిన ఈ  అద్భుతమైన ప్రోయాక్టివ్ చొరవను నేను అభినందిస్తున్నాను. ఢిల్లీ మహిళా కమిషన్ తన 181 ఉమెన్‌ హెల్ప్‌లైన్ ద్వారా గత 6 సంవత్సరాలలో లక్షల మంది మహిళలు, బాలికలకు సాయం చేసింది. ట్రూకాలర్ ప్రస్తుత చొరవ కమిషన్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్‌ను రెండింతలు చేసి కమిషన్ పరిధిని గణనీయంగా పెంచింది. పెరుగుతున్న కాల్స్‌కు అనుగుణంగా పటిష్ఠమైన వ్యవస్థను కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీ ప్రభుత్వ సహకారంతో దాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఆపదలో ఉన్న ప్రతి మహిళ, బాలికను చేరదీయాలని మేము హృదయపూర్వకంగా  ప్రయత్నిస్తున్నాం” అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జస్టిస్ ఎన్వీ రమణకు పాదాభివందనం : వైకాపా రెబెల్ ఎంపీ ఆర్ఆర్ఆర్