Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

గ్యారెంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ ఫ్లెక్సీని ఆవిష్కరించిన ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

Advertiesment
ICICI Pru Guaranteed Pension Plan Flexi
, మంగళవారం, 10 మే 2022 (17:09 IST)
తమ నూతన యాన్యుటీ ప్లాన్‌ ఐసీఐసీఐ ప్రు గ్యారెంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ ఫ్లెక్సీను ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆవిష్కరించింది. ఇది రెగ్యులర్‌ ప్రీమియం చెల్లింపు యాన్యుటీ ఉత్పత్తి. ఇది దీర్ఘకాలంలో రిటైర్‌మెంట్‌ సేవింగ్స్‌ను పొదుపు చేసుకునేందుకు తోడ్పడుతుంది.

 
ఈ ఉత్పత్తిని ప్రత్యేకంగా వినియోగదారుల అవసరాలను తీర్చడంతో పాటుగా వారు తమ పొదుపును మరింతగా వృద్ధి చేసుకునేందుకు సైతం తోడ్పడే రీతిలో తీర్చిదిద్దారు. తద్వారా ఉద్యోగ విరమణ అనంతరం ఆర్ధికంగా స్వేచ్ఛాయుత జీవితం గడిపేందుకు ఇది తోడ్పడుతుంది.

 
వినియోగదారుల వైవిధ్యమైన అవసరాలను తీర్చేందుకు ఐసీఐసీఐ గ్యారెంటీడ్‌ పెన్షన్‌ ఫ్లెక్సీ ఇప్పుడు ఏడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ అమిత్‌ పల్టా మాట్లాడుతూ ‘‘ఈ మహమ్మారి ఎంతోమంది జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. దానితో పాటుగా సేవింగ్స్‌, ఆదాయం మరీ ముఖ్యంగా రిటైర్‌మెంట్‌ జీవితం జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోవాల్సిన ఆవశ్యకత కల్పించింది.  

 
సాధారణంగా యాన్యుటీ ఉత్పత్తులను ఏక మొత్తంలో ప్రీమియం చెల్లించడం ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ  ఫ్రు గ్యారెంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ ఫ్లెక్సీని ప్రత్యేకంగా వినియోగదారులకు రెగ్యులర్‌ కంట్రిబ్యూషన్‌ తో తాము కోరుకున్న మొత్తాలను పొదుపు చేసే అవకాశం కల్పిస్తుంది. తద్వారా ఎంతోమంది ముందుగానే తమ రిటైర్‌మెంట్‌ జీవితాన్ని ప్రణాళిక చేసుకునే వీలు కలుగుతుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాన‌మ్మ వెంక‌ట‌మ్మ జ్ఞాప‌కార్థంగా స్కూల్ భవనం: మంత్రి కేటీఆర్