Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రక్తమోడుతున్న సిరియా.. గజగజ వణుకుతున్న గౌటా

సిరియా నగరం రక్తమోడుతోంది. గౌటా పట్టణం గజగజ వణికిపోతోంది. ప్రభుత్వ దళాల దాడులతో గౌటా నగరం శవాలదిబ్బగా మారింది. అలాగే, గత 8 రోజులుగా నగరంలో రక్తం ఏరులైపారుతోంది.

రక్తమోడుతున్న సిరియా.. గజగజ వణుకుతున్న గౌటా
, గురువారం, 1 మార్చి 2018 (10:26 IST)
సిరియా నగరం రక్తమోడుతోంది. గౌటా పట్టణం గజగజ వణికిపోతోంది. ప్రభుత్వ దళాల దాడులతో గౌటా నగరం శవాలదిబ్బగా మారింది. అలాగే, గత 8 రోజులుగా నగరంలో రక్తం ఏరులైపారుతోంది. పౌరుల్లో కలిసిపోయిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రభుత్వ దళాలు బాంబులతో విరుచుకుపడుతున్నాయి. వైమానికదాడుల్లో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 750 మంది పైచిలుకు ప్రాణాలు కోల్పోయాలు. వందలాది మంది చిన్నారులు తమ తల్లిదండ్రుల నుంచి దూరమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది ముక్కుపచ్చలారని చిన్నారులు, మహిళలు ఉన్నారు.
 
నిజానికి ఇక్కడ నెల రోజులపాటు కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తిరుగుబాటు దళాలు, సైన్యానికి సూచించింది. రష్యా - సిరియా బలగాలు దానిని తోసి రాజంటూ వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నాయి. ప్రస్తుత సిరియా పరిస్థితిపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోంది.
 
వాస్తవానికి గౌటా గత ఐదేళ్లుగా ప్రభుత్వ బలగాల అధీనంలోనే ఉంది. అయితే రష్యా, సిరియా దాడులతో బిక్కచచ్చిపోయిన ఉగ్రవాదులు నగరంలోకి చొచ్చుకొచ్చి పౌరుల్లో కలిసిపోయారు. దీంతో పరిస్థితి మరింత విషమించింది. ఇక ఇక్కడి ప్రజల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి చందాన తయారైంది. ఓ వైపు మిలిటెంట్లు, మరోవైపు ప్రభుత్వ బలగాల దాడులతో నలిగిపోతున్నారు. 
 
ఇదిలావుండగా, సిరియాలో ఇస్లామిక్‌స్టేట్ (ఐఎస్) ఉగ్ర వాదులకు పట్టున్న ఆఖరు గ్రామం అల్ షాఫా గ్రామంపై అమెరికా సంకీర్ణదళాలు విరుచుకుపడ్డాయి. ఇటీవల వాయుసేనల దాడుల్లో 25 మంది పౌరులు మరణించారు. సరిహద్దులోని ఐఎస్ నేత అల్బు కమల్ కంచుకోట అల్-షాఫా గ్రామంపై బాంబుల వర్షం కురిసిందని బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల పరిశీలకుడు రామి అబ్దెల్ రహమాన్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్లో అమ్మకానికి రెండు తలల పాము... ఎందుకో తెలుసా?