Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుట్టుకతోనే వృద్ధుడు.. ఎలా? కంటతడి పెట్టిస్తున్న ఫోటో...

మన ఇంట్లోకి కొత్త వ్యక్తి వస్తే ఎంత ఆనందం.. ఇంటిల్లపాది ఆనందం నెలకొంటుంది. సంబురాలు జరుపుకుంటారు. అలాంటిది ఓ శిశువు భూమిపైకి వస్తూనే వృద్ధుడుగా ఉంటే.. ఎంత ఘోరం. అందులోనూ కనీస ఆహారం లేక ఇలా పుట్టడం అంట

Advertiesment
పుట్టుకతోనే వృద్ధుడు.. ఎలా? కంటతడి పెట్టిస్తున్న ఫోటో...
, మంగళవారం, 24 అక్టోబరు 2017 (13:58 IST)
మన ఇంట్లోకి కొత్త వ్యక్తి వస్తే ఎంత ఆనందం.. ఇంటిల్లపాది ఆనందం నెలకొంటుంది. సంబురాలు జరుపుకుంటారు. అలాంటిది ఓ శిశువు భూమిపైకి వస్తూనే వృద్ధుడుగా ఉంటే.. ఎంత ఘోరం. అందులోనూ కనీస ఆహారం లేక ఇలా పుట్టడం అంటే ఎంత దారుణం. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా పచ్చి నిజం. సిరియా దేశంలో ఈ తరహా జననం వెలుగు చూసింది. ఈ శిశువుకు సంబంధించిన ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
సిరియాలో సమర్ అనే వ్యక్తి కుటుంబం కూలీ పనులతో కాలం వెళ్లదీస్తోంది. ఈయనకు ఇటీవలే దోఫ్ దా అనే చిన్నారి జన్మించింది. పుట్టుకతోనే వృద్ధుడి ఛాయలతో చిన్నారి జన్మించింది. కూలీ పనులు చేసే సమర్.. చిన్నారికి పాలు పట్టేందుకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డాడు. దీంతో నెల రోజులుగా ఆ బాలిక మరింత బలహీనమైంది. కేవలం ఒక 1.9 కిలోల బరువు మాత్రమే ఉంది. ఆ చిన్నారిని బతికించుకోవటం కోసం.. తూర్పు ఘౌటాలోని హమౌరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. సరైన ఆహారం లేక అప్పటికే బక్కచిక్కిన చిన్నారి కొనఊపిరితో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. ఆ చిన్నారిని బతికించడానికి వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు.
 
దీనిపై వైద్యులు స్పందిస్తూ, తల్లిదండ్రులకు ఉపాధి లేకపోవటంతో కనీసం పాలు తాగించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి ఎంతలా కష్టపడింది అంటే.. ఏడిస్తే కనీసం కన్నీళ్లు కూడా నెల రోజులుగా రాలేదట. ఊపిరి తీసుకోవటానికి కూడా బలం లేదట. అంటే కనీస ఆహారం కూడా ఆ తల్లిదండ్రులు చిన్నారికి ఇవ్వలేకపోయారని తెలిపారు. పైగా, పాలు ఇవ్వటానికి తల్లి దగ్గర కూడా సత్తువ లేదన్నారు వైద్యులు. సిరియా దేశంలో యుద్ధం వల్ల ఇప్పటికే ఐదు లక్షల మంది చిన్నారులు ఆకలి కేకలకు బలయ్యారని ఐక్యరాజ్యసమితి కూడా తెలిపింది.
 
ఇపుడు ఈ ఫొటో ఇప్పుడు ప్రపంచాన్ని కంట తడి పెట్టిస్తోంది. కనీస ఆహారం లేక పిల్లలు ఏ విధంగా మారుతున్నారు.. ఎలా చనిపోతున్నారో చెప్పటానికి ఇదో నిదర్శనం. ఆస్పత్రి నుంచి విడుదల అయిన ఈ ఫొటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సిరియా సంక్షోభాన్ని కళ్లకుకట్టినట్టు చూపిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థుల ఆత్మహత్యలను అడ్డుకోండి... మహిళలపై దాడులను అణిచివేయండి..