Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక - మంత్రివర్గం మొత్తం రాజీనామా

Advertiesment
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక - మంత్రివర్గం మొత్తం రాజీనామా
, సోమవారం, 4 ఏప్రియల్ 2022 (07:39 IST)
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధం అనేక ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా శ్రీలంక వంటి చిన్న దేశాలపై ఇది చాలా తీవ్రంగా ఉంది. అలాగే, మన దేశంలో చమురు ధరలపై ప్రభావం చూపుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో చిన్న దేశమైన శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోయింది. 
 
ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు నానాపాట్లు పడుతున్న శ్రీలంకలో పరిణాలు క్షణక్షణానికి మారుతున్నాయి. శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. అలాగే, శ్రీలంక మంత్రివర్గానికి చెందిన 26 మంద్రి మంత్రులు మొత్తం మూకుమ్మడిగా తమతమ పదవులకు గత రాత్రి రాజీనామా చేశారు. వీరంతా ప్రధానమంత్రికి రాజీనామా పత్రాలు సమర్పించారు. ఈ రాజీనామాలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ప్రజలు నుంచి వస్తున్న ఒత్తిళ్ళతోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
కాగా, ప్రస్తుతం శ్రీలంకలో పరిస్థితి మరింత దారుణంగా దిగజారిపోయింది. గుడ్డు నుంచి పాల వరకు అన్నింటి ధరలు చుక్కలను తాకుతున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. పెరిగిన ధరలు, నిత్యావసర సరకుల కొరత, విద్యుత్ కోతలతో నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ఇటీవల అధ్యక్ష భవనాన్ని ముట్టడించి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర హింస చెలరేగి రెండు మూడు రోజుల పాటు కర్ఫ్యూను విధించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాతీయ భద్రతా మాస వేడుకల ముగింపు సూచికగా వీడ్కోలు సభ