Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. రామేశ్వరం వచ్చేస్తున్న తమిళులు

Advertiesment
Food Shortage
, శుక్రవారం, 25 మార్చి 2022 (14:08 IST)
Sri lanka
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా శ్రీలంకకు ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. 1970వ దశకంలో సిరిమావో బండారునాయకే ప్రధానిగా ఉన్న సమయంలో శ్రీలంకలో కరువు ఏర్పడిందని అంటున్నారు. అయితే ప్రస్తుత సంక్షోభం అంతకంటే ఘోరంగా ఉందని కొందరు భావిస్తున్నారు. 
 
దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ దగ్గర నుంచి నిత్యావసర ధరలకు రెక్కలొచ్చాయి.  దీంతో శ్రీలంకేయులతో పాటు అక్కడున్న తమిళులు నానా తంటాలు పడుతున్నారు. తినడానికి తిండిలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో వలసబాట పడుతున్నారు శ్రీలంక తమిళులు. 
 
సముద్రం మార్గం ద్వారా రామేశ్వరం, ధనుస్కోడి ప్రాంతాలకు తరలివస్తున్నారు. శ్రీలంక తమిళుల కోసం ఇక్కడి సర్కార్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. 
 
పునరావాస కేంద్రాన్ని నెలకొల్పి వసతి కల్పిస్తోంది. రామేశ్వరంలో శ్రీలంక తమిళుల పునరావాస కేంద్రానికి వలసదారుల తాకిడి పెరుగుతోంది. శ్రీలంకలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడం వల్ల అనేక కుటుంబాలు తమ దేశాన్ని విడిచిపెట్టి అక్రమంగా భారత తీరాలకు చేరుకుంటున్నాయి. 
 
శ్రీలంక పౌరులు బోట్ల ద్వారా భారత్‌కు చేరుకున్నారు. ఇలా అక్రమంగా వస్తున్న వారిని తమిళనాడు మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
కాగా, శరణార్థులుగా భారత్‌కు చేరుకునే శ్రీలంక పౌరులను అడ్డుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు శ్రీలంక నేవీ అధికారులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ జనశక్తి నేత యాదన్న కిడ్నాప్.. పోలీసులే తీసుకెళ్లి వుంటారా?