Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంజీవని పర్వతాన్ని బ్రెజిల్‌కు మోసుకెళ్లి హనుమంతుడు!

Advertiesment
సంజీవని పర్వతాన్ని బ్రెజిల్‌కు మోసుకెళ్లి హనుమంతుడు!
, శనివారం, 23 జనవరి 2021 (11:31 IST)
ప్రస్తుతం ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతోంది. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, పలు కంపెనీలు వ్యాక్సిన్లను తయారు చేశాయి. అలాంటి వాటిలో భారత్‌లో తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లు ఉన్నాయి. అయితే, బ్రెజిల్‌కు భారత్ కరోనా వ్యాక్సిన్ డోసులను పంపించింది. మొత్తం 20 లక్షల కొవిషీల్డ్ డోసులను పంపించగా, అవి బ్రెజిల్‌కు చేరాయి. 
 
ఈ వ్యాక్సిన్లను తీసుకెళ్లిన విమానం శనివారం అక్కడి ఎయిర్ పోర్టులో దిగింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ధ్రువీకరించారు. ప్రపంచ ఔషధాగారాన్ని నమ్మండి అంటూ ట్వీట్ చేశారు. భారత్‌లో తయారైన టీకాలు బ్రెజిల్‌కు చేరాయన్నారు.
 
దీనిపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోసనారో స్పందించారు. 'ధన్యవాద్ భారత్' అని ట్వీట్ చేశారు. కరోనా వ్యాక్సిన్లతో కూడిన సంజీవని పర్వతాన్ని మోసుకొస్తున్నట్టున్న ఆంజనేయుడి ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. 
 
‘‘నమస్కారం ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యను అధిగమించే ప్రయత్నాల్లో ఓ గొప్ప భాగస్వామిని కలిగి ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నాం. భారత్ నుంచి మాకు వ్యాక్సిన్లు పంపి సాయం చేసినందుకు కృతజ్ఞతలు. ధన్యవాద్ భారత్’’ అని ఆయన ట్వీట్ చేశారు.
 
బ్రెజిల్ ప్రధాని ట్వీట్‌కు ప్రధాని నరేంద్ర మోడీ కూడా తిరిగి స్పందించారు. ఆ గౌరవం తమదన్నారు. 'కరోనా మహమ్మారితో పోరులో బ్రెజిల్ వంటి దేశానికి నమ్మకమైన భాగస్వామిగా ఉన్నందుకు ఆ గౌరవం మాది. ఆరోగ్య రంగంలో పరస్పర సహకారాన్ని మరింత దృఢం చేసుకుందాం' అంటూ రీట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో రూ.100, రూ.10, రూ. 5 నోట్లు రద్దు?