Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాతో చేతులు కలిపి నష్టపోయాం.. తటస్థంగా ఉండాల్సింది : ఇమ్రాన్ ఖాన్

అమెరికాతో చేతులు కలిపి నష్టపోయాం.. తటస్థంగా ఉండాల్సింది : ఇమ్రాన్ ఖాన్
, మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (11:15 IST)
అగ్రరాజ్యం అమెరికాతో చేతులు కలిసి తీవ్రంగా నష్టపోయినట్టు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో అమెరికాతో కలిసి పని చేయకుండా తటస్థంగా ఉండివుండాల్సింది అని చెప్పుకొచ్చారు. 
 
న్యూయార్క్‌లో జరిగిన విదేశీ సంబంధాల మండలి (సీఎఫ్‌ఆర్‌) మేధోవర్గం సదస్సులో ఇమ్రాన్‌ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 18 యేళ్ళ క్రితం అంటే 2001 సెప్టెంబర్‌ 11న ఆల్‌ఖైదా ఉగ్రవాదులు న్యూయార్క్‌ మన్‌హట్టన్లోని వాణిజ్య భవనాలు (డబ్య్లూటీసీ) ట్విన్‌ టవర్స్‌పై విమానాలతో దాడులు చేసి కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 2,976 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 6 వేల మంది గాయపడ్డారు.
 
అమెరికాలాంటి అగ్రరాజ్యం ఈ దాడులతో చిగురుటాకులా వణికిపోయింది. ఆ తర్వాత ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు అమెరికా పలు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా పాకిస్థాన్‌ సైనిక స్థావరాల సమీపంలోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందుతున్న ఆల్‌ఖైదా చీఫ్‌ ఒసామాబిన్‌ లాడెన్‌ను పట్టుకుని చంపేసింది.
 
2011, మే 2వ తేదీన అమెరికా దళాలు అర్థరాత్రి లాడెన్‌ ఇంటిపై దాడిచేసి మట్టుబెట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ సైన్యానికి తెలిసే ఇదంతా జరిగిందన్నది అప్పటి చర్చ. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ 9/11 తర్వాత సంఘటనలపై ఇప్పుడు వాపోవడం చర్చనీయాంశమైంది. 
 
ఉగ్రవాదంపై పోరుకోసం అమెరికాతో చేతులు కలపకుండా తటస్థంగా ఉండాల్సిందని, చేతులు కలిపి భారీ మూల్యం చెల్లించుకున్నామని ఇమ్రాన్‌ వాపోయారు. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 
మరోవైపు, ఇమ్రాన్‌తో జరిగిన సమావేశంలో కాశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే పాక్ ప్రధానమంత్రి ఈ తరహా మాటలు చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హుజూర్‌నగర్ బైపోల్ : రేవంత్ రెడ్డిపై కత్తికట్టిన టీపీసీసీ... పార్టీ మారుతారా?