Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెంట్రల్ మాలీపై ఫ్రాన్స్ బాంబుల వర్షం... 50 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులు హతం

సెంట్రల్ మాలీపై ఫ్రాన్స్ బాంబుల వర్షం... 50 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులు హతం
, మంగళవారం, 3 నవంబరు 2020 (11:10 IST)
మాలీపై ఫ్రాన్స్ దేశానికి చెందిన యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. అల్‌ఖైదా ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సుమారు 50 మంది వరకు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. నైగర్ అధ్యక్షుడు మహమదౌ ఇసోఫౌవుతో పార్లీ సమావేశం జరిగిన గంటల వ్యవధి తరువాత ఈ దాడులు జరగడం గమనార్హం.
 
మాలీ, నైగర్, ఫ్రాన్స్ దేశాల సరిహద్దుల్లో భారీ ఎత్తున మోటార్ సైకిల్ కారావాన్ సాగుతోందని తమ డ్రోన్లు గుర్తించిన తర్వాత విమానాలు వెళ్లి దాడులు చేశాయని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ వెల్లడించారు. 
 
దాడుల నుంచి తప్పించుకోవాలని ఉగ్రవాదులు చెట్లు తదితరాల చాటుకు వెళ్లారని, ఈ దాడుల్లో రెండు మిరేజ్ జెట్లు, ఓ డ్రోన్‌లను పంపి, మిసైల్స్‌ను జారవిడిచామని పార్లీ తెలియజేశారు.
 
బుర్కినా ఫాసో, నైగర్ సరిహద్దుల్లో వేచివున్న ప్రభుత్వ దళాలు ఉగ్రవాదులు ఉన్న ప్రదేశానికి చేరుకునేందుకు వీలును కల్పించేందుకు ఈ దాడులు చేసినట్టు తెలిపారు. 
 
మాలీలో బర్కానే దళాలతో కలిసి ఈ దాడులు చేశామని, ఉగ్రవాదులకు చెందిన ఆయుధాలను, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈదాడుల్లో ఉగ్రవాదులకు చెందిన 30 ద్విచక్ర వాహనాలు ధ్వసం అయ్యాయని ఆమె వెల్లడించారు. 
 
ఇక ఈ దాడుల తర్వాత నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు సైనిక అధికారి కల్నర్ ఫ్రెడ్రిక్ బార్బరీ తెలియజేశారు. దాడులు జరిగిన ప్రాంతం నుంచి పేలుడు పదార్థాలు, ఆత్మాహుడి దాడికి వినియోగించే దుస్తులు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఫ్రెడ్రిక్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీమూల్యం చెల్లించుకున్న ట్రంప్ అభిమానులు... 30 వేల మందికి కరోనా!!