Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్జిస్తున్న షంజ్‌పీర్ : చివరి రక్తపుబొట్టువరకు పోరాడుతాం

Advertiesment
Taliban
, మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:11 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని కైవసం చేసుకున్న తాలిబన్ తీవ్రవాదులకు షంజ్‌పీర్ అనే ప్రావీన్స్‌లో మాత్రం తీవ్రప్రతిఘటన ఎదురవుతోంది. దీంతో అక్కడ తాలిబన్ తీవ్రవాదులకు అపారమైన ప్రాణనష్టం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, షంజ్‌పీర్ పౌరులు మాత్రం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతారు అంటూ ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఎన్ఆర్ఎఫ్ నేత అహ్మద్‌ మసూద్‌ ఓ ఆడియో సందేశాన్ని తన ఫేస్‌బుక్ ఖాతాలో రిలీజ్ చేశారు. పంజ్‌షీర్‌లో తాలిబన్లపై విరుచుకుపడుతున్నాం. నార్తర్న్‌ అలయన్స్‌ దాడిలో తాలిబన్ల సీనియర్‌ కమాండర్‌ ఫసీయుద్దీన్‌ మౌల్వీని హతమార్చాం. ఫసీయుద్ధీన్ సహా మరో 13 మందిని మట్టుబెట్టాయి పంజ్‌షీర్ రెసిస్టెన్స్ ఫోర్సెస్‌. కుటుంబసభ్యులు, ముఖ్య అనుచరులను కోల్పోయినా సరే.. వెనకడుగు వేయడం లేదు. సింహాల్లా గర్జిస్తున్నారు. యావత్‌ ఆఫ్ఘన్‌ పౌరులను తాలిబన్లపై పోరుకు సిద్ధం చేస్తున్నారు. వారిలో ఉద్యమ కాంక్ష రగిలేలా ఈ సందేశం ఉంది. 
 
తాలిబన్లపై తిరగబడండి.. తిరుగుబాటు బావుటా ఎగరేయండి అంటూ ఆఫ్ఘన్‌ పౌరుల్లో పోరాటస్ఫూర్తిని మసూద్ రగిలిస్తున్నారు. ఎప్పటికీ తాలిబన్ల పాలన అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పంజ్‌షిర్‌పై దాడిలో పాక్‌ హస్తం కూడా ఉందని ఆరోపించారు. ముష్కరులతో కలిసి కుట్రలు చేస్తున్నా.. ధైర్యం కోల్పోవద్దు.. చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడుదాం.. చావో రేవో తేల్చుకుందాం.. పోరాటానికి సిద్ధం కండి అంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ ఆడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు ప్ర‌పంచ ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ దినోత్స‌వం