టైటానిక్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి ప్రపంచ యుద్ధం సమయంలో అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రయాణం చేయడానికి ఈ షిప్‌ను తయారు చేశారు. అప్పట్లో ఇది భారీ షిప్‌గా పేరు తెచ్చుకుంది.
అయితే 1912 నవంబర్ 14న సముద్రంలో ప్రయాణిస్తున్న టైటానిక్ మార్గమధ్యంలో ఐస్‌బర్గ్‌ను ఢీకొని, సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. ఈ ఘటన తర్వాత హాలీవుడ్‌లో టైటానిక్ పేరుతోనే ఫేమస్ ప్రేమ కథా చిత్రం కూడా తెరకెక్కింది. అయితే సముద్ర అడుగున్న ఈ షిప్.. మరికొన్ని ఏళ్లే కనిపించనుంది.
109 ఏళ్లు దాటినా ఆ ఓడ అవశేషాలు నేటికీ నీళ్లల్లో పదిలంగానే ఉన్నాయి. అయితే మరికొన్ని ఏళ్లల్లో అవి కనిపించవని పరిశోధకులు అంటున్నారు. ఒకరకమైన బ్యాక్టీరియా టైటానిక్ అవశేషాలను వేగంగా తినేస్తోందని, మరో 12ఏళ్లల్లో టైటానిక్ అని చెప్పుకోవడానికి నీళ్లల్లో ఒక్క ముక్క కూడా లదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
అయితే ఇన్ని సంవత్సరాలు సముద్ర గర్భంలో ఉన్న ఈ షిప్‌కు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే టైటానిక్‌కి సంబంధించిన లోహ భాగాలను దెబ్బతింటున్నాయని తెలిపారు. ఇలాగే ఉంటే మరో 12ఏళ్లలో టైటానిక్ ఆనవాళ్లు కనుమరుగవుతాయని అంటున్నారు.