Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

మెరైన్ వన్.. అందులో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి...

Advertiesment
Marine One
, శనివారం, 22 ఫిబ్రవరి 2020 (15:56 IST)
అమెరికా అధ్యక్షుడు ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఆయన వాహనాలపైనే అందరి దృష్టి ఉంటుంది. ప్రెసిడెంట్ విమానం, పర్సనల్ కారు, హెలికాప్టర్‌.. ఇలా ప్రతిదానిపై డిస్కషన్‌ జరుగుతుంది. అధ్యక్షుడి విమానం పేరు ఎయిర్ ఫోర్స్ వన్. అధినేత వ్యక్తిగత కారు ది బీస్ట్‌. ప్రెసిడెంట్ హెలికాప్టర్‌ పేరు మెరైన్ వన్. ఇందులో 200 చదరపు అడుగుల స్థలం ఉంటుంది. 14 మంది ప్రయాణించవచ్చు. మూడు ఇంజిన్లలో ఒకటి ఫెయిలైనా ప్రాబ్లెమ్ ఉండదు. రెండు ఇంజిన్లతోనే వెళ్లిపోవచ్చు.
 
అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా మెరైన్‌ వన్‌ హెలికాఫ్టర్‌ కూడా వెంట రావాల్సిందే. ఆయా దేశాల్లో చిన్న చిన్న దూరాలకు, బస చేసే హోటల్‌కి వెళ్లడానికి ఆ హెలికాప్టర్‌ని వినియోగిస్తారు. అయితే, అన్ని హెలికాప్టర్లను ప్రెసిడెంట్ జర్నీకి ఉపయోగించరు. వీహెచ్‌-3డీ సీ కింగ్‌ లేదా వీహెచ్‌-60ఎన్‌ వైట్‌ హాక్‌ హెలికాప్టర్లను మాత్రమే అధ్యక్షుడి ప్రయాణానికి వినియోగిస్తారు. ప్రెసిడెంట్‌ భద్రత దృష్ట్యా ఒకేరకంగా ఉన్న ఐదు హెలికాప్టర్లు ఒకేసారి ప్రయాణిస్తాయి. ఒక దాంట్లో అధ్యక్షుడు ఉంటే, మిగిలినవి ఆయనకు రక్షణగా వెళ్తాయి. ప్రెసిడెంట్ ఎందులో ఉన్నారో శత్రువులకు తెలీకుండా ఈ టెక్నిక్ ఉపయోగిస్తారు.
 
మెరైన్ వన్ అధ్యక్షుడి కోసం సికోర్స్కి కంపెనీ తయారు చేసిన ప్రత్యేకమైన హెలికాప్టర్. ఈ హెలికాప్టర్‌ను మెరైన్ హెలికాప్టర్ స్క్వాడ్రన్ వన్ నడుపుతుంది. ఇది అమెరికా మెరైన్ ఫోర్స్‌లో భాగం. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇతర కీలక అధికారుల రవాణాకు మెరైన్ వన్ బాధ్యత వహిస్తుంది. ఈ స్క్వాడ్రన్‌లోని నలుగురు పైలట్లను మాత్రమే హెలికాప్టర్ ఎక్కడానికి అనుమతిస్తారు. వీరిని నైట్ వాక్స్ అని పిలుస్తారు.
 
మెరైన్ వన్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. మెరన్‌ వన్‌లో అత్యాధునిక సమాచార వ్యవస్థ ఉంటుంది. క్షిపణి దాడులను కూడా తట్టుకుంటాయి. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. భారీ పేలుళ్లను తట్టుకొనేలా బాలిస్టిక్ ఆర్మర్ ఉంది. క్షిపణి హెచ్చరిక వ్యవస్థతో పాటు క్షిపణి రక్షణ వ్యవస్థ కూడా ఉంది. 1957లో నాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఐసన్ హోవర్ హెలికాప్టర్‌లో ప్రయాణించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా పేరు తెచ్చుకొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈఎస్ఐ స్కామ్ : అచ్చెన్నాయుడు పాత్ర ఎంత?