Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రంప్ స్వాగతం కోసం నిమిషానికి రూ.55 లక్షలు ఖర్చు..!!

ట్రంప్ స్వాగతం కోసం నిమిషానికి రూ.55 లక్షలు ఖర్చు..!!
, శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (14:29 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించడమంటే ఆశామాషి వ్యవహారం కాదు. అందులో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు ట్రంప్‌ రావడంతో అక్కడి ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌ టూర్‌ కోసం గుజరాత్‌ సర్కార్‌ భారీగా నిధులు కేటాయించింది. ట్రంప్‌ 3 గంటల పర్యటనకు ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తోంది. ట్రంప్ కు స్వాగతం పలకడం కోసం నిమిషానికి రూ.55 లక్షలు ఖర్చు చేస్తుంది.
 
అమెరికా  అధ్యక్షుడా....? మజాకా...?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన భార్య మిలానియా ట్రంప్‌తో కలిసి ఫిబ్రవరి 24న భారత పర్యటనకు  వస్తున్నారు. అయితే ఆయన టూర్‌ ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి  మొదలవుతోంది. ట్రంప్‌ను స్వాగతించేందుకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌ పర్యటనలో ఎలాంటి  లోటుపాట్లు కనిపించకూడదని గుజరాత్‌ సీఎం విజయ్ రూపానీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 
ఖర్చు  విషయంలో వెనకాడవద్దని కూడా సీఏం సూచించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి కావాలని ప్రభుత్వం  అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశ అధ్యక్షుడు తమ రాష్ట్రానికి వస్తుండడంతో అహ్మదాబాద్‌ నగరం నవ వధువులా ముస్తాబవుతోంది. ట్రంప్‌ వెళ్లే మార్గంలో రోడ్లు అద్దంలా కనిపించేందుకు అహ్మదాబాద్‌ నగరపాలక  సంస్థ చర్యలు చేపట్టింది. రోడ్లను మరమ్మతులు చేయడంతో పాటు నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దుతోంది.  ఇందుకోసం 6 కోట్లు ఖర్చు చేస్తోంది.
 
అహ్మదాబాద్‌ నగరంలోని మొత్తం 17 మార్గాల్లో రోడ్లు బాగు చేస్తున్నారు. ట్రంప్‌ పాల్గొనే మోతేరా స్టేడియంను  కూడా తీర్చి దిద్దుతున్నారు. మోతేరా స్టేడియం నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే 1.5 కిలోమీటర్ల మార్గంలో కొత్తగా రోడ్డు  వేస్తున్నారు. రోడ్ల కోసం గుజరాత్‌ ప్రభుత్వం 60 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పేదరికం ఆనవాళ్లు  కనపడకుండా జాగ్రత్త పడుతోంది. స్లమ్ ఏరియాలో నివసించే పేదల గుడిసెలు కనిపించకుండా అడ్డంగా ఓ గోడను  నిర్మిస్తోంది. 
 
గుజరాత్‌ టూర్‌లో భాగంగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫిబ్రవరి 24న 22 కిలోమీటర్ల మేర  కొనసాగే రోడ్‌షోలో  పాల్గొంటారు. 50 వేలకు పైగా బీజేపీ కార్యకర్తలు వీరికి స్వాగతం పలకనున్నారు.  ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి సబర్మతీ ఆశ్రమానికి వెళతారు. అక్కడి నుంచి మోతెరాలోని నూతనంగా  నిర్మించిన క్రికెట్‌ స్టేడియంకు చేరుకుంటారు. 
 
రోడ్‌ షో మార్గాన్ని సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. డివైడర్లకు  రంగులు వేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా పూలతో అలంకరిస్తున్నారు. ఇందుకోసం 6 కోట్లు ఖర్చవుతోంది. రోడ్‌  షో సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను 4 కోట్లు కేటాయించారు.
 
ట్రంప్‌ భద్రతా ఏర్పాట్ల కోసం గుజరాత్ ప్రభుత్వం 15 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. మోతేరా స్టేడియంలో  నిర్వహిస్తున్న 'కేమ్ ఛో ట్రంప్' కార్యక్రమానికి సుమారు లక్షమంది హాజరవుతారని అంచనా. వీరి ట్రాన్స్‌పోర్ట్  అల్పాహారం కోసం సుమారు 10 కోట్లు ఖర్చవుతుంది. ట్రంప్‌ పర్యటన కోసం గుజరాత్‌ ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేస్తోంది. 
 
ఈ ఖర్చులో కొంతభాగం కేంద్రం పంచుకుంటున్నా... అధికమొత్తంలో ఖర్చును గుజరాత్‌ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అయితే నగరంలోని  రోడ్ల మరమ్మత్తుల కోసం అహ్మదాబాద్‌ నగరపాలక సంస్థ బడ్జెట్‌లో 500 కోట్లు కేటాయించినట్లు అధికారులు  చెబుతున్నారు. ఆ నిధుల్లో నుంచి రోడ్లకు ఖర్చు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో కరోనా.. జిరాఫీగా మారిన మహిళ (వీడియో)