వచ్చే నెల 21న ఇండియాకు ట్రంప్!

గురువారం, 30 జనవరి 2020 (08:23 IST)
అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్ మన దేశ పర్యటన దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్యలో ఆయన మన దేశంలో టూర్​ చేస్తారని సమాచారం. ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ట్రంప్ బహిరంగ సభలోపాల్గొంటారని తెలిసింది.

ఈ సభ అహ్మదాబాద్లో ఉండే అవకాశముందని చెబుతున్నా.. దీనిని ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్​లో ఇప్పటికే ఆయన కోసం సూట్​ బుక్​ చేసినట్టు తెలిసింది. ఇంతకు ముందు క్లింటన్​, ఒబామా కూడా ఇదే హోటల్​లో బస చేశారు.

వచ్చే నెల 24 నుంచి మార్చి 30 వరకు జెనీవాలోని యూఎన్​ హ్యూమన్​ రైట్స్​ కౌన్సిల్​ వేదికగా మనదేశాన్ని బద్నామ్ చేయడానికి పాకిస్తాన్ ​రెడీ అవుతున్న సమయంలో ట్రంప్ టూర్ కు ప్రాధాన్యం ఏర్పడింది.

ఎన్నార్సీ, ఎన్​పీఆర్​తో పాటు మోడీ పాలనలో ముస్లింలకు సెక్యూరిటీ లేదని వాదనలను కూడా పాకిస్తాన్​  కౌన్సిల్​ దృష్టికి తీసుకెళ్లే అవకాశముందని మన అధికారులు కొందరు చెప్పారు.
 
చర్చించే అంశాలివీ.......
ట్రంప్ టూర్​లో ట్రేడ్ చర్చలే ప్రధానాంశంగా ఉంటుందని అధికారులు చెప్పారు. దీంతో పాటు చైనా, ఇండో, పసిఫిక్​, ఆఫ్గనిస్తాన్​, ఇరాన్​, పాక్‌లో టెర్రరిజం లాంటి అంశాలు కూడా చర్చకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఇళ్ల పట్టాల పంపిణీకి స్థానిక ప్రజల అభిప్రాయాలు: పేర్ని నాని