Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డోనాల్డ్ ట్రంప్ ప్రచారంలో మెరుపులా మెరుస్తున్న ఆ మహిళ ఎవరు?

Laura Loomer

ఠాగూర్

, ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (14:06 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, డోనాల్డ్ ట్రంప్‌ ప్రచారంలో తరచుగా కనిపిస్తున్న లారా లూమర్ అనే 31 ఏళ్ల యువతి గురించి సొంత పార్టీ రిపబ్లికన్లతో పాటు మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఫారా - రైట్, జాతీయవాద భావాలున్న లారాకు వివాదాస్పద చరిత్ర ఉండటంతో రిపబ్లికన్ పార్టీలోని కొందరు నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు.
 
ముస్లిం వ్యతిరేకిగా పేరున్న లారా లూమర్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌‍తో కలిసి కనిపిస్తున్నారు. 9/11 దాడులు గురించి గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ ఘటన మనదేశంలో నివసించే వారి పనేనంటూ ఆమె సంచలన కామెంట్స్ చేసింది. 9/11 దాడుల జ్ఞాపకార్థం జరిగిన కార్యక్రమంలో ట్రంప్‌తో పాటు లూమర్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ డిబేట్ సమయంలోనూ ఆమె ట్రంప్‌తో పాటు ఫిలడెల్ఫియా వెళ్లారు. ట్రంప్‌తో లూమర్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై పలు మీడియా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
 
వాస్తవానికి ట్రంప్‌తో లూమర్ ఎంత సన్నిహితురాలు అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ట్రంప్‌తో ఆమె పాల్గొనడంపై సొంత పార్టీ రిపబ్లికన్లలోనూ ఆందోళన వ్యక్తం అవుతున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ట్రంప్ చర్చల్లో లూమర్ జోక్యం చేసుకోలేదని కొందరు పేర్కొంటున్నారు. ఆమె సానుకూల వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. ఈ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో లూమర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ట్రంప్‌కు మద్దతుగా స్వతంత్రంగా తాను పని చేస్తున్నట్లు ఆమె పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తన కంపెనీ రహస్యాన్ని బహిర్గతం చేసిన బిల్ గేట్స్!!