Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : పోటీ తప్పుకున్న జో బైడెన్!!

Advertiesment
joe biden

వరుణ్

, సోమవారం, 22 జులై 2024 (10:51 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించరాు. పార్టీ సీనియర్ సభ్యుల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు తెలిపారు. అదేసమయంలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే కమలా హ్యారీస్‌కు మద్దతు ఇస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. 
 
డెమోక్రాట్ పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ తాను నామినేషన్‌ను ఆమోదించకుండా పరిపాలనపైన దృష్టి పెట్టాలనుకుంటున్నానని బైడెన్ స్పష్టం చేశారు. 2020లో తాను అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించగానే మొదటగా కమలా హ్యారీస్‌ను ఉపాధ్యక్షురాలిగా నియమించానని, ఈ మూడున్నరేళ్ల పాలనలో ఆమె తనకు ఎంతగానో సహకరించారని, తన వారసురాలిగా ఆమెను ఆమోదిస్తున్నానంటూ బైడెన్ పేర్కొన్నారు. 
 
కమలా హ్యారీస్‌తు తాను పూర్తిస్థాయిలో మద్దతిస్తానని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా డోనాల్డ్ ట్రంప్‌ను ఓడిద్దామంటూ బైడెన్ పిలుపునిచ్చారు. తన పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నామని, పార్టీ నిర్ణయం మేరకు దేశ ప్రయోజనాల కోసం ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు.
 
ఇక ప్రియమైన అమెరికన్లకు అని సంభోదిస్తూ.. అమెరికా అధ్యక్షుడిగా సేవ చేయడం తన జీవితంలో గొప్ప గౌరవమని బైడెన్ పేర్కొన్నారు. గడిచిన మూడున్నరేళ్లలో చక్కటి పురోగతి సాధించామని, నేడు అమెరికా ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్థిక శక్తిగా ఉందని అన్నారు. దేశ పునర్నిర్మాణంలో ఎంతో కృషి చేశామని, మాదకద్రవ్యాలను నిరోధించామని, తుపాకీ సంస్కృతికి చెక్ పెట్టేలా చట్టాన్ని తీసుకొచ్చామని ఆయన ప్రస్తావించారు. అంతేకాదు కొవిడ్ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లామని, ఆర్థిక ఒడిదుడుకులు ఎదురుకాకుండా వ్యవహరించామని అన్నారు.
 
కాగా అధ్యక్ష ఎన్నికల రేసు తప్పుకునేదే లేదన్నట్టుగా ఇంతకాలం వ్యవహరించిన జో బైడెన్ ఎట్టకేలకు పార్టీలో అంతర్గత ఒత్తిడికి తలొగ్గారు. వయసు మీద పడడంతో ఆయన పలు సందర్భాల్లో తికమకకు గురవుతుండడం, హత్యాయత్నం తర్వాత డోనాల్డ్ ట్రంప్ అదరణ మరింత పెరిగిపోవడంతో ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలనే ఒత్తిడి ఆయనపై పెరిగింది. పర్యవసానంగా తాజా నిర్ణయం వెలువడిందని అమెరికా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి ప్రత్యేక హోదా ఖాయం.. ఇవ్వకపోతే టీడీపీ అలా చేస్తుంది..?