Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తన కంపెనీ రహస్యాన్ని బహిర్గతం చేసిన బిల్ గేట్స్!!

bill gates

ఠాగూర్

, ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (13:26 IST)
ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.. తన కంపెనీ రహస్యాన్ని బహిర్గతం చేశారు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తన కలలను నెరవేర్చుకోవడానికి కళాశాల విద్యను మధ్యలోనే ఆపేసినట్లు బిల్ గేట్స్ తెలిపారు. ప్రతి ఇంట్లో డెస్క్ పర్సనల్ కంప్యూటర్ ఉండాలన్న దృక్పథంతోనే మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించి విజయం సాధించినట్టు ఆయన తెలిపారు. 
 
హార్వర్డ్ యూనివర్శిటీని వీడినప్పుడు బిలియనీర్ అవుతానని ఊహించలేదన్నారు. డబ్బు, కీర్తి కంటే గొప్ప ఉత్పత్తిని సృష్టించడంపై తన దృష్టి ఉండేదన్నారు. సాఫ్ట్‌వేర్‌పై నిబద్దత, కంప్యూటింగ్‌లు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే తన ఆలోచన దాదాపుగా ఫలించినట్టు చెప్పారు. 
 
కాగా తమ లక్ష్యాలను సాధించేందుకు కాలేజీ మధ్యలోనే చదువు ఆపేసి విజయవంతమైన వ్యాపారవేత్తల్లో బిల్ గేట్స్ ఒకరిగా ఉన్నారు. ఈ జాబితాలో గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ అధినేత స్టీవ్ జాబ్స్, మెటా అధినేత మార్క్ జుకర్‌బెర్గ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. వీరంతా సాఫ్ట్‌వేర్ రంగంలో నిబద్ధతతో పనిచేశారు. కంప్యూటింగ్ అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. 
 
ఈ దిశగా చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. బిల్ గేట్స్ తన స్నేహితుడు పాల్ అలెన్‌తో కలసి 1970లో కంప్యూటర్ లను యూజర్ ఫ్రెండ్లీగా, సామాన్యులకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేశారు. గేట్స్, అలెన్ తరచూ దీనిపై పని చేశారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం మార్కెట్ క్యాప్ దాదాపు మూడు ట్రిలియన్ డాలర్లుగా ఉన్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధానమంత్రి కుర్చీ కోసం రేసులో నిలిస్తే మద్దతిస్తామన్నారు : నితిన్ గడ్కరీ