Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంతకీ కమలా హ్యారీస్ శ్వేత జాతీయురాలా.. నల్ల జాతీయురాలా? ట్రంప్ ప్రశ్న!!

Advertiesment
donald trump

వరుణ్

, గురువారం, 1 ఆగస్టు 2024 (12:25 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ యేడాది ఆఖరులో అగ్రరాజ్యాధినేత పీఠానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థులుగా ఖరారైన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ పార్టీ మహిళా నేత కమలా హ్యారీస్ పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నారు.
 
తాజాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమలా హ్యారీస్ నిజంగా నల్లజాతీయురాలా? శ్వేతజాతీయురాలా? లేకా 2024 అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం అలా చెప్పుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
 
'కమలా హ్యారీస్ ఎప్పుడూ భారతీయ వారసత్వం కలిగిన వ్యక్తిగానే ఉండేవారు. భారతీయ వారసత్వాన్ని మాత్రమే ఆమె ప్రచారం చేసుకున్నారు. నల్లజాతిగా మారిన కొన్నేళ్ల కిందటి వరకు ఆమె నల్లజాతీయురాలని నాకు తెలియదు' అని ట్రంప్ అన్నారు. ఈ మేరకు షికాగోలో 'నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్'లోని జర్నలిస్టుల ప్యానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
 
ప్రస్తుతానికైతే తనను నల్లజాతీయురాలిగానే పిలవాలని కమలా హ్యారీస్ కోరుకుంటున్నారని, కాబట్టి ఆమె భారతీయురాలా? లేక నల్లజాతీయురాలా? అనేది తనకు తెలియదని ట్రంప్ విమర్శించారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక నల్లజాతి మహిళ, దక్షిణాసియా వారసత్వం కలిగిన వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడడంపై ప్రశ్నించగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
కాగా, డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. కమలా హ్యారీస్‌పై వ్యక్తిగత దాడి చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వైట్ హౌస్ కార్యాలయం తక్షణమే స్పందించింది. ట్రంప్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ మండిపడింది. 'వాళ్లు అది.. వీళ్లు ఇది.. అని చెప్పే హక్కు ఎవరికీ లేదు' అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్- పియర్ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై రేవంతన్న కామెంట్స్.. బీఆర్ఎస్ ఫైర్