Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ ప్రభుత్వమే భారత్‌పై ఉగ్రదాడులు చేయిస్తోంది : ఖైబర్‌పుంఖ్వా సీఎం సొహైల్

Advertiesment
Terrorist

ఠాగూర్

, బుధవారం, 19 నవంబరు 2025 (11:31 IST)
పాకిస్థాన్ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఖైబర్‌పుంఖ్వా ప్రావిన్స్ ఒకటి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సొహైల్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై పాకిస్థాన్ ప్రభుత్వమే ఉగ్రదాడులు చేయిస్తోందని ఆరోపించారు. పాక్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ అజెండాలో భాగంగానే నకిలీ ఉగ్ర దాడులు చేయిస్తోందన్నారు. 
 
పాక్ మీడియాలో వస్తున్న కథనాల మేరకు.. ఈ ప్రావీన్స్ ముఖ్యమంత్రిగా సొహైల్ ఆఫ్రిది బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, పాక్ ప్రభుత్వం ఖైబర్ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాద సంఘటనలను సృష్టిస్తోందని ఆరోపించారు. నిజమైన శాంతి ప్రయత్నాలను అడ్డుకుంటుందన్నారు. 
 
ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన పష్తూన్ తహాపుజ్ మూమెంట్ (పీటీఎం) సభ్యులు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. దీన్ని అఫ్రిది తీవ్రంగా ఖండించారు. శాంతి మార్గాలను పక్కదారి పట్టించడంతో పాటు ఆఫ్ఘనిస్థాన్‌లో తమ ప్రావీన్స్‌కు మధ్య ఏర్పడిన సంబంధాలను అడ్డుకునేందుకు ఇస్లామాబాద్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దీన్ని పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా తమ నాయకుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లాగానే తాను తలవంచనన్నారు. శాంతి ప్రయత్నాలకు భంగం కలిగించేవారిని ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఖైబర్ పుంఖ్వా ప్రాంతాల్లో కొనసాగుతున్న సైనిక కార్యకలాపాలను ఆయన విమర్శించారు. సాయుధ దళాలు ఉగ్రవాద ఏరివేత పేరుతో పౌరులను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారు దీన్ని ఉగ్రవాదంపై యుద్ధంగా పేర్కొంటున్నారని.. కానీ, సొంత ప్రజలనే చంపుతున్నారని మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మారేడుపల్లి అడవుల్లో మళ్లీ మోగిన తుపాకుల మోత... మావో కార్యదర్శి దేవ్‌జీ హతం