Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Advertiesment
poison milk

సెల్వి

, శనివారం, 5 జులై 2025 (23:31 IST)
తాము కోరుకున్నది దక్కించుకోవడానికి మనుషులు ఎంతకైన తెగిస్తున్నారు. ప్రియుడితో పెళ్లికి తల్లి అడ్డంగా ఉందని భావించి తల్లినే చంపిందో పదవతరగతి విద్యార్థిని. ఇలాంటి ఘటన పాకిస్థాన్‌లో జరిగింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఏకంగా 27 మంది కుటుంబ సభ్యులకు విషం ఇచ్చింది. ఈ ఘటన సంచలనం సృష్టించింది. 
 
వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ ముజఫ్ఫర్‌గఢ్‌‌కు చెందిన అసియా బీబీ అనే యువతికి కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు. తనకు ఇష్టం లేని పెళ్లిచేస్తే ఏమైనా చేస్తానని హెచ్చరించింది. దీన్ని పెద్దగా పట్టించుకోని ఆ యువతి కుటుంబ సభ్యులు 27మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ యువతి చెప్పినట్లే కుటుంబ సభ్యులను అంతమొందించింది. దీంతో కుటుంబ సభ్యులు తాగే పాలల్లో ఎలుకల మందు కలిపింది. 
webdunia
woman
 
ఇంకా తనను పెళ్లి చేసుకోబోయే అజ్మద్‌తో సహా అందరికీ విషం కలిపిన పాలు ఇచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన వారు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో అసియాబీబీతో పాటు ఆమె ప్రియుడు షాహిద్ హస్తం కూడా ఉందని తేలింది. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం