Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జార్జ్‌ను గొంతుపై నొక్కి చంపేశారు.. రిపోర్ట్.. ట్రంప్‌కు కొత్త తలనొప్పి?

జార్జ్‌ను గొంతుపై నొక్కి చంపేశారు.. రిపోర్ట్.. ట్రంప్‌కు కొత్త తలనొప్పి?
, మంగళవారం, 2 జూన్ 2020 (19:55 IST)
George Floyd
అమెరికాలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇందుకు కారణమనై జార్జ్ పోస్టు మార్టం రిపోర్ట్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మినసోట్టా ప్రావిన్స్‌కు చెందిన జార్జ్ ఫ్లాయిడ్ అనే 42 ఏళ్ల నల్లజాతికి చెందిన వ్యక్తి గత వారం పోలీసులకు చిక్కాడు. అయితే పోలీసులకు చిక్కిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
ప్రస్తుతం జార్జ్ పోస్టు మార్టం రిపోర్టులో అతడిని కింద తోసి గొంతుపై కాలు పెట్టి నొక్కడంతోనే మరణించాడని తేలింది. ఇప్పటికే జార్జ్ మెడను తొక్కిపెడుతూ ఓ పోలీస్ చేసిన అకృత్యానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అమెరికాలో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. శాంతియుతంగా ప్రారంభమైన నల్లజాతి పోరాటం ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది. 
 
పలు నగరాల్లో 144 సెక్షన్ అమలులో వుంది. అయినా పోరాటాలు జరుగుతూనే వున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది. ప్రస్తుతం నల్లజాతీయులు చేసే ఆందోళనలు సైతం ట్రంప్ సర్కారుకు చుక్కలు చూపిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో పోలీసుల దాడి కారణంగానే జార్జ్ హతమయ్యాడని పోస్టు మార్టం రిపోర్టు వెలువడింది. దీనికి సంబంధించిన ప్రకటనలో.. గొంతును నొక్కిపెట్టడంతో గుండెపోటు ఏర్పడి... ఆక్సిజన్ తక్కువై.. శ్వాస తీసుకోలేక జార్జ్ మరణించారని వెల్లడైంది. జార్జ్ మృతి సహజంగా ఏర్పడలేదని హత్య అని పోస్టు మార్టం రిపోర్టు తేల్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

IIT JEE, NEET పరీక్షల తయారీ విభాగంలోకి ప్రవేశించిన అడ్డా247