పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం అందుకున్న అధికారులు సంబంధిత ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన 13 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భారత సైన్యానికి భీకర పోరు జరిగింది. ఎదురుకాల్పుల్లో పలువురు భారత జవాన్లు సైతం గాయపడ్డారు. వారికి సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై సీనియర్ ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. మార్చి 28 నుంచే ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు కుట్రలు పన్నుతున్నారని సమాచారం అందినట్లు చెప్పారు. వాటి ఆధారంగానే పూంచ్ సెక్టార్‌లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదుల తారసపడ్డరని తెలిపారు.