Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వైరస్‌కు గబ్బిలాలే కారణమా?

Advertiesment
కరోనా వైరస్‌కు గబ్బిలాలే కారణమా?
, శనివారం, 21 మార్చి 2020 (14:05 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ 180 దేశాలకు విస్తరించింది. 2లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 11వేల మంది చనిపోయారు. ఇంకా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరిగే సూచనలు ఉన్నాయి. యావత్ ప్రపంచాన్ని గజగజవణికిస్తున్న కరోనా వైరస్.. ఎలా వచ్చింది? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కరోనా వైరస్ గబ్బిలం ద్వారా వచ్చిందా? పాంగోలిన్ ద్వారా వచ్చిందా? అనే దానిపై చర్చ సాగుతోంది. 
 
2019 డిసెంబర్ 27న 41మంది ఆసుపత్రి పాలయ్యారు. హుబే ప్రావిన్స్‌లోని వుహాన్ సిటీలోని మార్కెట్ సమీపంలో ముందుగా కొందరకి ఈ వైరస్ సోకింది. అది మొదలు చైనాలో క్రమంగా కరోనా వైరస్ విస్తరించింది. అక్కడి నుంచి ఇతర దేశాలకు పాకింది. చూస్తుండగానే మనుషులు పిట్టల్లా రాలిపోయారు. కరోనా వైరస్ కు అసలు మూలం ఏంటి అనేది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 
 
కరోనా వైరస్‌కు చైనీయులే కారణం అని ఆరోపణలు ఉన్నాయి. వారి ఆహారపు అలవాట్ల వల్లే కరోనా వచ్చిందని అంటున్నారు. చైనీయులు గబ్బిలాలు, కుక్కలు, పిల్లులు, పాంగోలిన్ వంటి వాటిని తింటారని, ఆ విపరీత ఆహారపు అలవాట్ల వల్లే కరోనా వైరస్ మహమ్మారి వచ్చిందని మండిపడుతున్నారు. చైనీయులు నష్టపోవడమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ప్రమాదంలో పడేశారని వాపోతున్నారు.
 
తాజాగా చైనా వూహాన్ నగరంలో తలెత్తిన కరోనా వైరస్‌పై జరిపిన పరిశోధనలో కరోనా కృత్రిమంగా ఎవ్వరూ తయారు చేసింది కాదని.. ప్రకృతంగా ఏర్పడిందని తేలింది. ఈ విషయాన్ని క్రిస్టియన్ ఆండర్సన్ నాయకత్వంలోని బృందం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్థానిక పోరుకు డిమాండ్ చేసిన జగన్.. ఇపుడు ఇళ్ళపట్టాల పంపిణీ వాయిదావేశారు