Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో చైనా మహిళా గూఢచారి అరెస్టు

అమెరికాలో చైనా మహిళా గూఢచారి అరెస్టు
, శుక్రవారం, 24 జులై 2020 (22:41 IST)
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి కబళిస్తున్నది. అగ్రదేశమైన అమెరికా కూడా కరోనా కోరల్లో చిక్కుకొని అల్లాడుతున్నది. లక్షలాది మంది కరోనా బారిన పడగా, వేలాది మంది మరణించారు. మరికొందరు చావుతో పోరాడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్వవస్థ చాలా దెబ్బతిన్నది. ఈ వైరస్ వ్యాప్తికి చైనా కారణమని అమెరికా అనేక ఆరోపణలు చేస్తున్నది.
 
ఈ విషయంలో ఇరు దేశాల మద్య ప్రచ్చన్నయుద్దం కొనసాగుతుంది. అలాగే కొంతకాలం అమెరికా అగ్ర కంపెనీలైన ఆపిల్, అమేజాన్ వంటి 20 కంపెనీలపై చైనా గూఢచర్యం చేస్తుందని, చైనా ప్యాక్టరీలు తయారుచేసిన మదర్ బోర్డును వాడుతున్న అమెరికా కంపెనీలపై డ్రాగన్ గూఢచర్యం చేస్తుందని, మదర్ బోర్డులో మైక్రోచిప్పును అమర్చి అమేజాన్, ఆపిల్ వంటి 28 ఇతర కంపెనీల సంస్థల సర్వర్లను చైనా హ్యాక్ చేస్తుందని ఓ యూఎస్ పత్రిక ప్రకటించడంతో ఈ వివాదం ముదిరింది.
 
అయితే ఇప్పుడు దానికి తగ్గట్టుగా చైనాకు చెందిన మహిళా గూఢచారిని అమెరికా పోలీసులు పట్టుకున్నారు. అమెరికాలో ఓ విద్యార్థిలా ఎంట్రీ ఇచ్చింది. అక్కడి కేన్సర్ ఆస్పత్రిలో జరిగే సమాచారాన్ని మెల్లగా చైనాకు చేరవేసింది. వెంటనే ఆమెను ఎప్బీఐ అధికారులు పట్టుకొని విచారణ జరపగా ఆమె చైనీస్ మిలిటరీ ఆఫీసర్, తంగ్ జువాన్‌గా గుర్తించారు. అయితే ఈ విధంగా దాదాపు 25 మంది చైనా పీపుల్స్ లిబరేషన్ అధికారులు వచ్చినట్లు సమాచారం. వీరిని అదుపులో తీసుకునేందుకు అమెరికా గాలింపు ముమ్మరం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. కరోనా టెస్టుకు రూ.15వేలు.. పాజిటివ్‌కు రూ.75వేలు