చైనా యాప్‌లపై నిషేధం విధించినా భారత్ తీరు మారట్లేదు. ఇప్పటికీ గుట్టుగా చైనా యాప్స్ ఇండియాలో ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పాత పేర్లకు బదులుగా కొత్త కంపెనీల పేర్లతో యాప్స్ రన్ చేస్తున్నాయని తెలిసింది.
తాజాగా దేశంలో చైనాకు సంబంధించిన కొన్ని యాప్‌లు పెరిగిపోతున్నాయి. అలీబాబా, బైటెన్స్ షియోమి వంటి వాటి కొన్ని కంపెనీలను నిషేధించినా.. వీటిలో చాలా కంపెనీలు తమ చైనీస్ మూలాలను దాచేందుకు ప్రయత్నించాయి.
కొత్త కంపెనీ పేర్లతో తమ యాప్‌లను లిస్ట్ చేస్తున్నాయి. యాప్ ఓనర్ షిప్ పబ్లిక్ డేటా అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు భారతదేశంలో టాప్ 60 యాప్‌లలో కనీసం 8 యాప్‌లు చైనా ఆపరేట్‌గా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
ప్రతి నెలా 211 మిలియన్లకు పైగా యూజర్లను చేరుకోవాలనేది వీటి లక్ష్యమని ఓ నివేదిక వెల్లడించింది. జూలై 2020లో చైనీస్ యాప్‌లు నిషేధించిన తర్వాత అదే యాప్‌లు 96 మిలియన్ యూజర్లను కలిగి ఉన్నాయి. గత 13 నెలల్లో 115 మిలియన్ కొత్త యూజర్లు చేరినట్టు తెలుస్తోంది.