Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ ప్రియుడి పెళ్లిని అడ్డుకున్న యువతి.. వైరల్ వీడియో

Advertiesment
Bride
, మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (15:18 IST)
ప్రేమించుకున్న వారు ఏదో ఒక కారణం చేత విడిపోతుంటారు. ఆ తర్వాత వారు వేర్వేరుగా మరో వ్యక్తితో ప్రేమను పంచుకుంటుంటారు. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడొక సంఘటన చోటు చేసుకుంది. ఒక అమ్మాయి మరియు అబ్బాయి ఒకప్పుడు గాఢంగా ప్రేమించుకున్న ప్రేమికులు. తర్వాత వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. 
 
అబ్బాయి గతాన్ని మరచిపోయి మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యాడు. సరిగ్గా పెళ్లి రోజున మరో అమ్మాయికి ఉంగరం తొడిగే సమయంలో ఆ మాజీ ప్రేయసి వచ్చి, తనని పెళ్లి చేసుకోవాలంటూ అతడిని స్టేజ్ మీది నుంచి లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. తప్పు తనదేనంటూ ఆమె వేడుకుంది. వరుడు మాత్రం ఎంతకీ తాను రానంటూ మొండికేశాడు. 
 
ఈ తతంగం అంతా చూసి చిర్రెత్తుకొచ్చిన కొత్త పెళ్లి కూతురు స్టేజ్ మీది నుంచి వెళ్లిపోయింది. ఆమె వెంటే వరుడు కూడా వెళ్లాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ముక్కోణపు ప్రేమకథ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటికే కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోని మీరు కూడా ఓసారి చూడండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్భం ధరించిన మహిళా ఉద్యోగిని.. శరీరాకృతి మారిందని.. ఉద్యోగాన్ని ఊడగొట్టారు..