Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయి ఎలాంటిదో పెళ్లికి ముందే తెలుసుకోవాలనుకున్నాడు..

Advertiesment
అమ్మాయి ఎలాంటిదో పెళ్లికి ముందే తెలుసుకోవాలనుకున్నాడు..
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (10:50 IST)
పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి ఎలాంటిదని పెళ్లికి ముందే తెలుసుకోవడానికి ఓ పెళ్లికొడుకు ప్రయత్నించాడు. సాధారణంగా పెళ్లిళ్లు నమ్మకంపై నిలబడతాయని పెద్దలు అంటుంటారు. కానీ కాబోయే భార్యపై నమ్మకం లేక ఆమెను అనుమానించడం మొదలుపెట్టాడు ఓ ప్రబుద్ధుడు. అనంతపురం జిల్లాకు చెందిన పెళ్లి కొడుకు మహేష్ పెళ్లి కుమార్తె ఎలాంటిదో పెళ్లికి ముందే తెలుసుకోవాలనుకున్నాడు. 
 
మహేష్ DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పని చేస్తున్నాడు. నాగోల్‌లోని స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వహకుడు కిరణ్‌కుమార్‌ని కలిశాడు. విషయాన్ని పూర్తిగా వివరించి, అమ్మాయి వివరాలతో పాటు ఆమెకు ఎవరెవరు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారో చెప్పాలని అడిగాడు. ఈ పని చేసిపెట్టేందుకు రూ. 17 వేలు ఇస్తానని డీల్ కుదుర్చుకున్నాడు. హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఇంటర్ చదువుతున్న ఆ యువతిని (పెళ్లి కూతురు) గమనించేందుకు కిరణ్‌కుమార్ ఓ లేడీ డిటెక్టివ్‌ని రంగంలోకి దింపాడు.
 
ఆ లేడీ డిటెక్టివ్ సదరు యువతిని ఫాలో అవుతూ..సీక్రెట్‌గా వీడియోలు తీసింది. వ్యక్తిగత విషయాలను బయటకు ఆరా తీసి, తన బాస్ కిరణ్‌కుమార్‌తో కలిసి ఆ యువతి చదివే కాలేజీకి కూడా వెళ్లింది. ఇతర విద్యార్థులను వివరాలు అడిగింది. ఇదంతా తెలుసుకున్న కొందరు విద్యార్థులు మెల్లగా విషయాన్ని పెళ్లి కూతురు తల్లిదండ్రులకు చేరవేసారు. 
 
వెంటనే ఆమె తల్లిదండ్రులు ప్రతిస్పందించి, కాలేజీకి వచ్చారు. ఆ డిటెక్టివ్‌లను పట్టుకున్నారు. వారిని కొట్టడానికి ప్రయత్నించగా, వారు నిజాన్ని బయటపెట్టారు. ఇదంతా చెయ్యడానికి పెళ్లికొడుకు మహేషే కారణమని వాళ్లు చెప్పారు.
 
మైనర్ బాలిక వెంటపడుతూ రహస్యంగా వీడియోలు చిత్రీకరించడాన్ని అవమానంగా భావించిన తల్లిదండ్రులు చైతన్యపురి పోలీసులకు కంప్లైంట్ చేసారు. పోలీసులు రంగంలోకి దిగి కిరణ్‌కుమార్‌తో పాటు లేడీ డిటెక్టివ్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. వాళ్లు నడుపుతున్న డిటెక్టివ్ ఏజెన్సీకి అసలు అనుమతే లేదు. 
 
కేవలం లేబర్ లైసెన్స్ మాత్రమే ఉంది. పెళ్లికి ముందు అమ్మాయిల వ్యక్తిగత సమాచారం తెలుసుకునే అధికారం ఎవరికీ లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇదంతా చేయించిన మహేష్‌ని కూడా అరెస్టు చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అహ్మద్ పటేల్‌కి ఫోన్ చేసి జగన్ సీఎం కాకుండా చెడగొట్టింది నేనే... కె.ఎ పాల్