అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ గురించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కరోనా వైరస్ విజృంభించడానికి డొనాల్డ్ ట్రంపే కారణం అన్నారు.
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే అమెరికా అంతటా వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందన్నారు. కరోనాను కట్టడిచేసే ఉద్దేశంతో ట్రంప్ సర్కార్ ప్రయాణాలపై ఆంక్షలు విధించిందని, ఆ నిర్ణయమే కొంప ముంచిందని అభిప్రాయపడ్డారు.
ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వల్ల ఇతర దేశాల్లో ఉన్న అమెరికన్లు పెద్ద సంఖ్యలో అమెరికాకు చేరుకున్నారని, వారికి కరోనా టెస్టులు చేయలేదని, వారిని కనీసం క్వారెంటైన్ కేంద్రాలకు కూడా తరలించలేదని బిల్‌గేట్స్ ఆరోపించారు.
కోవిడ్ టెస్ట్ కిట్లు, క్వారెంటైన్ కేంద్రాలు పరిమిత సంఖ్యలో ఉండటమే అందుకు కారణమని చెప్పారు. దాంతో అమెరికా అంతటా వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందన్నారు.