Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రా అసెంబ్లీకి వాస్తు దోషం : కొనసాగుతున్న గేట్ల మూసివేత...

ఆంధ్రా అసెంబ్లీకి వాస్తు దోషం : కొనసాగుతున్న గేట్ల మూసివేత...
, బుధవారం, 9 సెప్టెంబరు 2020 (20:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి వాస్తు దోషం ఉందట. అందుకే అసెంబ్లీకి ఉన్న గేట్లలో ఒక్కొక్కటిని మూసివేసుకుంటూ వస్తున్నారు. ఏపీ సెక్రటేరియేట్, అసెంబ్లీలకు వెళ్లే దారుల్లో ఇప్పటికే మూడు గేట్లను మూసివేసిన అధికారులు, తాజాగా మరో రెండు గేట్లను కూడా మూసివేశారు. 
 
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత గత తెదేపా ప్రభుత్వం తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవాలను గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని వెలగపూడి ప్రాంతంలో నిర్మించారు. 
 
అయితే, రాష్ట్రంలో అధికార మార్పిడి చోటుచేసుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. దీంతో అమరావతి ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. అయితే, కరోనా, లాక్డౌన్‌కు ముందు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఆందోళనలు చేసిన వేళ, అసెంబ్లీ, సచివాలయానికి వెళ్లే గేట్లను మూసివేసిన సంగతి తెలిసిందే.
 
దీనిపై సచివాలయ అధికారులు స్పందిస్తూ, వాస్తు శాస్త్రం ప్రకారం సచివాలయం, శాసనసభకు వెళ్లే గేట్లలో కొన్నింటిని తొలగించాలని పండితులు నిర్ణయించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. 
 
కానీ, ఈ సంవత్సరం జనవరి 20న అమరావతి రైతులు 'చలో అసెంబ్లీ' నిర్వహించగా, సీఎం బ్లాక్ నంబర్ 1 వరకూ పలువురు రైతులు, మహిళలు రావడం, వారిని అడ్డుకునే మార్గాలు పోలీసులకు తెలియక పోవడంతో, ఆపై ప్రభుత్వం ఒక్కో గేట్‌నూ మూసివేస్తూ వచ్చింది.
 
కాగా, భద్రతా కారణాలు, వాస్తు శాస్త్రం ప్రకారమే గేట్లను మూసివేస్తున్నామని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) అధికారులు అంటున్నారు. తాజాగా సెక్రటేరియట్ గేట్ 1తో పాటు అసెంబ్లీ గేట్ 2 లను శాశ్వతంగా మూసివేస్తూ గోడ నిర్మాణం కొనసాగుతుండగా, ఇవి రెండూ పూర్తయితే, మొత్తం ఐదు గేట్లు మూతపడినట్లు అవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వదినతో ఒక్క సెల్ఫీ, అడ్డంగా దొరికిపోయిన తమ్ముడు, రోకలిబండతో ఒక్క దెబ్బతో...