Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా ఓ గొప్ప దేశం.. లీడ్ చేసే ఛాన్స్ రావడం ఓ అదృష్టం : బైడెన్

Advertiesment
అమెరికా ఓ గొప్ప దేశం.. లీడ్ చేసే ఛాన్స్ రావడం ఓ అదృష్టం : బైడెన్
, ఆదివారం, 8 నవంబరు 2020 (10:46 IST)
అమెరికా ఓ గొప్ప దేశమని, అలాంటి దేశానికి నాయకత్వం వహించే అవకాశం రావడం గొప్ప అదృష్టమని యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ అన్నారు. పైగా, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా గత రాత్రి ఆయన స్పందించారు. 
 
'అమెరికా... ఓ గొప్ప దేశానికి నాయకత్వం వహించే అవకాశం నాకు లభించడం ఎంతో గర్వకారణం. మన ముందున్న లక్ష్యాలు చాలా క్లిష్టతరమైనవి. అయినా, నేను హామీ ఇస్తున్నాను. నాకు ఓటు వేసినా, వేయకున్నా, అమెరికన్లు అందరికీ నేను అధ్యక్షుడిగా ఉంటా. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటా' అంటూ పేర్కొన్నారు. 
 
కాగా, జో బైడెన్‌తో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ ట్విట్టర్ ప్రొఫైల్స్ మారిపోవడం గమనార్హం. వీరిద్దరూ కాబోయే అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు అని తమ ప్రొఫైల్స్ మార్చేసుకున్నారు. అమెరికాను తిరిగి నిలిపేందుకు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు బైడెన్ తెలిపారు.
 
అలాగే, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ కూడా స్పందించారు. బైడెన్ విజయం సాధించిన అనంతరం ఆయనకు ఫోన్ చేసిన కమల.. ‘మనం సాధించాం’ అని ఫోన్ చేసి చెప్పి అభినందించారు. ‘తదుపరి అధ్యక్షుడు మీరే’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 
 
బైడెన్ విజయాన్ని ఆమె అమెరికన్ల ఆత్మకు సంబంధించినదిగా అభివర్ణించారు. ‘ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ అమెరికన్స్’ అంటూ ఓ వీడియో సందేశాన్ని కమల తన ట్విట్టర్ ఖాతాలోపోస్టు చేశారు. అమెరికాకు చేయాల్సింది ఎంతో ఉందని పేర్కొన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో జో బైడెన్‌కు 290 ఎలక్టోరల్ ఓట్లు, ట్రంప్‌కు 214 ఓట్లు పోలయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో ఐయూఎంఎల్ ఎమ్మెల్యే అరెస్టు.. ఎందుకో తెలుసా?