16 ఏళ్ల టీనేజ్ యువతిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపింది 23 ఏళ్ల మహిళ. ఈ ఘటన యూకేలో దారుణం చోటుచేసుకుంది. తన వద్ద తీసుకున్న డబ్బులు చెల్లించేందుకు గాను ఆమెను కూడా వ్యభిచారిణిగా మార్చింది. ఏకంగా ఒకే రోజు 17 మంది పురుషుల వద్దకు ఆ టీనేజ్ యువతిని పంపించింది.
వివరాల్లోకి వెళితే.. యూకేలోని సండర్‌ల్యాండ్‌కి చెందిన టైలర్ జో వాకర్ (23) అనే వ్యభిచారిణి కొద్దిరోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 16 ఏళ్ల టీనేజ్ యువతికి గాలం వేసింది.
తరచూ చాట్ చేస్తూ ఆమెకు దగ్గరైంది. ఈ క్రమంలో యువతికి కొంత డబ్బు కూడా ఇచ్చింది. ఇదే క్రమంలో ఓరోజు యువతిని తన అపార్ట్‌మెంట్‌కు పిలిపించింది. తానే ట్యాక్సీ బుక్ చేసి డబ్బులు కూడా చెల్లించింది.
యువతి తన అపార్ట్‌మెంట్‌కు వచ్చాక.. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలని వాకర్ ఆమెను కోరింది. యువతి వద్ద డబ్బులు లేకపోవడంతో.. వ్యభిచారం చేసి తన అప్పు తీర్చాలని డిమాండ్ చేసింది. ఇందుకోసం మొదట ఆ యువతిని వివస్త్రగా చేసి ఫోటోలు తీసింది. ఆ ఫోటోలను ఫోన్ ద్వారా పలువురికి ఫార్వార్డ్ చేసింది.
ఒకేరోజు 17 మంది పురుషులతో వ్యభిచారం చేయించింది. దీనిపై బాధిత యువతి కోర్టును ఆశ్రయించగా... కేసును విచారించిన న్యాయస్థానం తాజాగా టైలర్ జో వాకర్‌కు 16 నెలల జైలు శిక్ష విధించింది.