Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాసా ఆపరేషన్ ఆకర్ష.. అంతరిక్షంలోకి నగ్న చిత్రాలు.. ఎందుకంటే?

Advertiesment
Beacon in the Galaxy
, శనివారం, 2 ఏప్రియల్ 2022 (20:26 IST)
నాసా ఆపరేషన్ ఆకర్ష చేపట్టారు. ఇందులో భాగంగా మన్మథ అస్త్రాన్ని ఎలియన్స్ మీదకు ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా స్త్రీ, పురుషుల నగ్న చిత్రాలను అంతరిక్షంలోకి వదలాలని నిర్ణయించుకున్నారు. 
 
భూమిపై నుంచి మనుషులు పంపుతున్న సంకేతాలను ఎలియెన్స్ అర్థం చేసుకోలెకపోతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు 'బీకాన్ ఇన్ ది గెలాక్సీ'  అని పేరు పెట్టారు. అయితే, ఇందులో మనుషుల ఫొటోలను పంపించరు. పురుషుడు, స్త్రీ పూర్తిగా నగ్నంగా ఉన్న బొమ్మలను పంపిస్తారు. చేతులను పైకెత్తి.. ఎలియన్స్‌కు 'హాయ్' చెప్పినట్లుగా ఆ బొమ్మలు ఉంటాయి.  
 
'సైబర్‌ఫ్లాషింగ్' చట్టం ప్రకారం స్త్రీ, పురుషుల జననాంగాలు కనిపించే నగ్న చిత్రాలను ఇతరులకు పంపడం నేరం. అయితే, అంతరిక్షానికి ఈ రూల్స్ వర్తించవనే కారణంతో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగానికి నడుం కట్టారు. 
 
గ్రహాంతరవాసులను సంప్రదించేందుకు గత 150 ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలు విఫల ప్రయత్నాలు ఎన్నో చేశారు. బోలెడన్ని నిధులను వెచ్చించారు. కానీ, ఇప్పటికీ ఫలితం చిక్కలేదు. ఈ నేపథ్యంలో నాసా శాస్త్రవేత్తలు.. ఎలియెన్స్‌లో కోరికలు రగిలించే ప్రయత్నం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘కూల్స్‌ లైక్‌ ఐస్‌ లుక్స్‌ సో నైస్‌ ’: బజాజ్ ఎలక్ట్రికల్స్ నుంచి ఎయిర్‌ కూలర్స్‌