Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరోగ్య‌శాఖ మంత్రి ఆళ్ళ నాని మాన‌వ‌త్వం... క్ష‌త‌గాత్రుడికి వైద్య సేవ‌లు

ఆరోగ్య‌శాఖ మంత్రి ఆళ్ళ నాని మాన‌వ‌త్వం... క్ష‌త‌గాత్రుడికి వైద్య సేవ‌లు
విజ‌య‌వాడ‌ , సోమవారం, 17 జనవరి 2022 (16:51 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి, డిప్యూటీ సిఎం ఆళ్ల నాని మాన‌వ‌త్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి తలకు బలమైన గాయంతో రోడ్డు ప‌క్క‌న పడి ఉన్న శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని చూసి, ఆపదలో ఆపట్బంధావుడుగా నిలిచారు మంత్రి ఆళ్ల నాని. రోడ్ ఆక్సిడెంట్ అయి, విజయవాడ కొత్త బస్టాండ్ బెంజ్ సర్కిల్ మధ్యలో రోడ్ పక్కన పడిన శ్రీనివాస్ రెడ్డిని చూసి మంత్రి త‌న కాన్వాయిని నిలిపేశారు. 

 
తాడేపల్లి సిఎం క్యాంపు ఆఫీస్ లో కరోనా రివ్యూ మీటింగ్ ముగించుకొని  వస్తున్న సమయంలో రోడ్డు పక్కన పడిఉన్న క్షతగాత్రుడిని గమనించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెంటనే కారు దిగి క్షతగాత్రుడు దగ్గరికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన పేషి సిబ్బంది ద్వారా ప్రోటోకాల్ వాహనంలో హెల్ప్ హాస్పిటల్ కి పంపించారు. 
 
 
ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి హుటాహుటిన ప్రోటోకాల్ వాహనంలో హెల్ప్ హాస్పిటల్ కి తన సిబ్బంది ద్వారా తరలించ‌డ‌మే కాకుండా హెల్ప్ హాస్పిటల్ యాజమాన్యంతో ఫోనులో మాట్లాడారు. తక్షణమే క్షత గాత్రుడుకి వైద్యం అందిస్తున్నారు. ఆపదలో ఆపడ్బంధావుడుగా తన ప్రాణాలు కాపాడార‌ని బాధితుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిని కొనియాడుతున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతి: మూడు రోజుల్లో హైదరాబాద్ ప్రజలు ఎంత చికెన్ తిన్నారంటే.. ప్రెస్ రివ్యూ