Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రక్తపైత్య రోగానికి ఆవుతో అధ్బుత వైద్యం

Advertiesment
రక్తపైత్య రోగానికి ఆవుతో అధ్బుత వైద్యం
, శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:06 IST)
రక్తపైత్య రోగం అనగా నోటివెంట దగ్గినప్పుడు రక్తం పడటం. నాటు ఆవుపాలు పావు లీటరు తీసుకుని గిన్నెలో పోసి దానిలో మంచినీరు 1 1/4 లీటరు కలిపి చిన్న మంట పైన నీరంతా ఇగిరిపోయి పాలు మిగిలే వరకు మరగబెట్టి దించి చల్లారిన తరువాత ఆ పాలను ప్రతిరోజూ తాగుతూ ఉంటే దగ్గులో రక్తం పడే రక్త పిత్త వ్యాధి కొద్దిరోజులలోనే తగ్గిపోవును. ఇంత సులువైన మందు యే వైద్య విధానంలో లేదు
 
విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవడానికి -
కాచిన ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో పటికబెల్లం పొడి 30 గ్రా , ఆవునెయ్యి 20 గ్రా , లక్కపొడి 2 గ్రా కలిపి ఒక మోతాదుగా రోజు రెండుపూటలా తాగిస్తూ ఉంటే ఒకటి లేక రెండు వారాలలో విరిగిపోయిన ఎముకలు తప్పకుండా అతుక్కుంటాయి.
 
అతి కఫం హరించుట కొరకు 
రోజు రెండు పూటలా పావు లీటరు ఆవుపాలలో ఒక గ్రాము మిరియాల పొడి , పటికబెల్లం పొడి 20 గ్రాములు కలిపి తాగుతూ ఉంటే ప్రకోపించిన అతి కఫం అదృశ్యం అవుతుంది.
 
పాండు రోగం , క్షయ హరించుట కొరకు -
ఇనుప పాత్రలో కాచబడిన ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో తగినంత కండ చక్కర పొడి కలిపి రోజు పరగడపున సేవిస్తూ ఉంటే క్రమంగా పాండురోగం పారిపోయి రక్త వృద్ది కలుగుతుంది. క్షయవ్యాధి బహు త్వరగా పారిపోతుంది.
 
ఎక్కిళ్లు వెంటనే తగ్గుట కొరకు -
కాచిన ఆవుపాలు పావు లీటరు మోతాదుగా పటికబెల్లం పొడి కలిపి గోరువెచ్చగా కొంచంకొంచం తాగుతూ ఉంటే అప్పటికప్పుడే ఎక్కిళ్లు తగ్గుతాయి
 
పిల్లల ఆరోగ్యానికి -
అప్పటికప్పుడు చిలికిన మజ్జిగ నుంచి తీసిన ఆవువెన్న ని పసిపిల్లల అన్నప్రాసన రోజు నుంచి ఉదయం, మద్యాహ్నం, సాయంత్రం వేళ్ళల్లో వయసుని బట్టి పూటకు ఒక గ్రాము నుంచి పెంచుకుంటూ 10 గ్రాముల వరకు తినిపిస్తుంటే ఆ పిల్లల శరీరం ఉక్కులా బలంగా తయారు అయ్యి అవయవాలు అందంగా ఉంటాయి. తెలివి పెరుగును.
 
సంభోగ సుఖం కొరకు
గోరువెచ్చని ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో పటికబెల్లం పొడి 25 గ్రా కలిపి మొదటిసారి సంభోగం అయ్యాక వెంటనే సేవిస్తే ఆ సంభోగం తాలుకు నీరసం తగ్గిపోవడమే కాక తిరిగి త్వరగా మరలా సంభోగం చేయగల శక్తి లభించును.
 
గమనిక -
పైన చెప్పిన ఫలితాలు కేవలం నాటు అనగా దేశి వాళి ఆవుపాలు ద్వారానే సాధ్యం . సంకర జాతి పాలతో సాధ్యం కాదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా నుంచి కోలుకున్నాక కొత్త రుగ్మతలు...