Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త విమానానికి టెస్ట్ - గాల్లో మంటలు.. కుప్పకూలిన సైనిక విమానం

Advertiesment
కొత్త విమానానికి టెస్ట్ - గాల్లో మంటలు.. కుప్పకూలిన సైనిక విమానం
, మంగళవారం, 17 ఆగస్టు 2021 (19:40 IST)
రష్యాలో ఘోర ప్రమాదం సంభవించింది. సైన్యానికి చెందిన ఓ కొత్త విమానాన్ని పరీక్షిస్తుండగా ఈ ప్రమాదం సంభించింది. గాల్లోకి ఎరిగిన కొద్దిసేపటి తర్వాత విమానం ఒక రెక్క భాగంలో మంటలు చెలరేగడంతో కుప్పకూలిపోయింది. ఈ విమానం ప్రోటో టైప్ కార్గో విమానం. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లతో పాటు.. ఫ్లైట్ ఇంజనీర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన రాజధాని మాస్కో శివారుల్లో జరిగింది. 
 
రష్యా సైన్యానికి చెందిన ఓ కొత్త తేలికపాటి రవాణా విమానాన్ని మాస్కో సమీపంలోని కుబింకా ఎయిర్‌ఫీల్డ్‌లో పరీక్షించారు. ఈ విమానం తిరిగి ల్యాండ్‌ అవుతుండగా ఒక్కసారిగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటలతోనే కొంతసేపు ప్రయాణించిన విమానం.. ఆ తర్వాత తలకిందులై కిందపడిపోయింది. 
 
ఈ ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు టెస్ట్‌ పైలట్లు, ఫ్లైట్‌ ఇంజినీర్‌ దుర్మరణం చెందారు. ఇందుకు సంబంధించిన వీడియోను బజా అనే ఆన్‌లైన్‌ మీడియా పోర్టల్‌ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
 
మరోవైపు, ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తామని రష్యా ఎయిర్‌ ట్రాఫిక్‌ అథారిటీ వెల్లడించింది. మిలిటరీ సిబ్బంది, పరికరాలు, ఆయుధాల రవాణా కోసం ఇల్యూషిన్‌ అనే సంస్థ ఈ విమానాన్ని తయారుచేసింది. 
 
ఈ నెలాఖరులో జరిగే ఆర్మీ-2021 కార్యక్రమంలో ఈ విమానాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. ఇందుకోసం నేడు పరీక్షలు నిర్వహించగా.. ప్రమాదవశాత్తూ కూలిపోయింది. దీంతో ఈ విమానం నాణ్యతా ప్రమాణాలపై పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయేషా కేసు వై.ఎస్., హ‌జీరాభీ కేసు జగన్ నీరుగార్చారు: లోకేష్