Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆవు పాలు గేదె పాలు.. రెండింటిలో ఏవి మంచివంటే ?!

ఆవు పాలు గేదె పాలు..  రెండింటిలో ఏవి మంచివంటే ?!
, సోమవారం, 6 సెప్టెంబరు 2021 (08:16 IST)
ఆరోగ్యానికి పాలు చాలా మంచిది. పాలల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అలానే పాలల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల్ని, పళ్ళని దృఢంగా ఉంచుతుంది. డాక్టర్లు కూడా పాలని ప్రతి రోజూ తాగమని చెప్తూ ఉంటారు. పాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఫిట్ గా ఉండొచ్చు.
    
ఆవు పాలు మరియు గేదె పాలు రెండిట్లో ఏది తాగాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే రెండిట్లో కూడా కొన్ని లాభాలు, నష్టాలూ కూడా ఉన్నాయి వాటి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి దీంతో మీకు ఏ పాలు తాగితే మంచిది అన్నది క్లారిటీ వస్తుంది.
 
కొవ్వు:
పాలలో కొవ్వు పదార్ధాలు కూడా ఉంటాయి. ఆవు పాలతో పోల్చుకుంటే.. గేదె పాలలో ఎక్కువగా ఉంటుంది. అందుకనే గేదె పాలు చిక్కగా ఉంటాయి. ఆవు పాలు లో 3 నుండి 4 శాతం కొవ్వు ఉంటే గేదె పాలలో 7 నుండి 8 శాతం కొవ్వు ఉంటుంది. దీనితో జీర్ణం అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది.
 
నీళ్లు:
ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లు కనుక మీరు ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే ఆవు పాలని ప్రిఫర్ చేయండి. ఆవు పాలలో 90 శాతం నీళ్లు ఉంటాయి. ఇది డిహైడ్రేషన్ కి గురై పోకుండా హైడ్రేట్ గా ఉంచుతుంది. కానీ గేదె పాలలో అలా కుదరదు.
 
​ప్రోటీన్స్:
ఇక మనం ప్రోటీన్ల విషయానికి వస్తే.. ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో 10 నుండి 11 శాతం ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా గేదె పాలలో ఉండటం వల్ల పెద్దవాళ్ళకి గేదె పాలను ప్రిఫర్ చేయడం మంచిది కాదు.
 
​కొలెస్ట్రాల్:
ఇక కొలెస్ట్రాల్ విషయంలోకి వస్తే... రెండు పాలల్లో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా వేరేగా ఉన్నాయి. గేదె పాలలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. దీనితో పిసిఒడి, హైపర్ టెన్షన్, కిడ్నీ సమస్యలు, ఒబిసిటీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లకీ మంచిది. కాబట్టి దీనిని కూడా గమనించి పాలను తీసుకోవడం మంచిది.
 
క్యాలరీలు:
ఇక మనం ఈ రెండు పాలల్లో దేనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దేనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి అనే విషయానికి వస్తే.. గేదె పాలలో క్యాలరీలు సమృద్దిగా ఉంటాయి ఎందుకంటే గేదె పాలలో కొవ్వుపదార్ధాలు మరియు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు గేదె పాలలో 237 కేలరీలు ఉంటాయి. అదే ఒక కప్పు ఆవు పాలలో 148 కేలరీలు ఉంటాయి.
 
​ప్రిజర్వేషన్:
గేదె పాలను ఎక్కువL కాలం ప్రిజర్వ్ చేయడానికి అవుతుంది. దీనికి గల కారణం ఏమిటంటే గేదె పాలలో హై పెరోక్సిడైజ్ యాక్టివిటీ ఉంటుంది అంటే ఇది ఒక ఎంజైమ్ లాంటిది. అదే ఆవు పాలని ఎక్కువ కాలం వుంచలేము. వాటిని ఒకటి లేదా రెండు రోజులలో తాగేయాలి.
 
​రంగు:
ఈ రెండు పాలు కూడా చూడడానికి వివిధ రంగుల్లో ఉంటాయి. గేదె పాలు వైట్ క్రీమ్ కలర్‌లో ఉంటే ఆవు పాలు కాస్త ఎల్లోయిష్ గా ఉంటాయి. గేదె పాలలో బీటా-కెరోటిన్ పిగ్మెంట్ రంగుని లేకుండా చేస్తుంది. ఆవు పాలలో విటమిన్ ఏ ఉండడం వల్ల కాస్త పసుపు రంగు ఉంటుంది.
 
మరికొన్ని తేడాలు:
● మీరు చక్కగా నిద్ర పోవాలంటే ఖచ్చితంగా గేదె పాలని ప్రిఫర్ చేయండి.
 
● అదే విధంగా కోవా, పెరుగు, పన్నీర్, పాయసం, కుల్ఫీ, నెయ్యి వంటి వాటిని తయారు చేసుకోవడానికి కూడా గేదె పాలే మంచిది.
 
● అదే ఒకవేళ మీరు స్వీట్లు తయారు చేసుకోవాలంటే ఆవు పాలని ప్రిఫర్ చేయడం మంచిది.
 
● అయితే రెండు పాలు కూడా ఆరోగ్యానికి మంచిదే. అయితే ఇక్కడ ఉన్న తేడాలను బట్టి మీకు ఏది బెస్టో చూసుకొని తాగండి.
 
● కానీ ప్రతిరోజూ పాలను తాగడం మాత్రం స్కిప్ చేయొద్దు ఎందుకంటే పాల వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెల్లం కలిపిన వేడిపాలు తాగితే...!