Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విభూదిని అలా పెట్టుకుంటే.. ఏమవుతుంది..?

Advertiesment
vibudhi
, శుక్రవారం, 29 మార్చి 2019 (11:01 IST)
గంధపు బొట్టు, చందన తిలకాన్ని నుదుట పెట్టుకుంటే మెదడు చల్లబడుతుంది. కోపావేశాలు తగ్గి శాంతగుణం అలవడుతుందని పండితులు చెబుతున్నారు. డబ్బాలలో అమ్మే కొన్ని గంధం పొడుల్లో కల్తీ ఉంటుంది. కాబట్టి సువాసనగల గంధపు చెక్కతో గంధపు సానపై తీసిన గంధంతోనే బొట్టు పెట్టుకోవడం మంచిది. 
 
కల్తీ గంధపు పొడులను ఉపయోగిస్తే గంధం పెట్టుకున్న చోట మచ్చలేర్పడుతాయి. నొసటిపై గంధాన్ని పూసుకోవడం వలన కనుబొమ్మల మధ్య కేంద్రీకరిపంబడిన జ్ఞాన తంత్రులకు ఉద్ధీపన జరిగి సంకల్పశక్తి పెరుగుతుంది. 
 
అవయవాలన్నీ చురుకుగా పనిచేస్తాయి. రోగాలకు చందనం దివ్యౌషధం కావడంతో, చందనాన్ని తిలకంగా ధరించడం ద్వారా రోగకారక క్రిములు నశించిపోతాయని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
అలాగే విభూతిని నీటితో తడిపిపెట్టుకోవాలనే నియమముంది. పొడి విభూతి పెట్టుకోకూడదు. గృహస్థులు నీటితో తడిపి పెట్టుకోవాలని, స్త్రీలు, సన్యాసులు పొడి విభూతి పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29-03-2019 - శుక్రవారం మీ రాశిఫలితాలు - కళలకు సంబంధించిన పోటీలలో రాణిస్తారు..