ధర్మ సందేహం : అన్నం తిన్న కంచంలో చేయి కడగకూడదా?
భోజనం చేసిన కంచంలోనే చాలామంది చేయి కడుగుతుంటారు. ఇలా చేయడం వల్ల దరిద్రదేవతను ఆహ్వానించడమేనని ఆధ్యాత్మిక ప్రవచన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భోజనం చేసిన కంచంలోనే చాలామంది చేయి కడుగుతుంటారు. ఇలా చేయడం వల్ల దరిద్రదేవతను ఆహ్వానించడమేనని ఆధ్యాత్మిక ప్రవచన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లక్ష్మీ కటాక్షం కలిగివుండి దరిద్రదేవత అనుగ్రహం కావాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కంచంలో చేయి కడగకూడదని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే, అన్నం ఆరగించే సమయంలో అన్నం మెతుకులు అరచేతిని దాటి రాకూడదు.
భోజనం చేసేసమయంలో శుభ్రంగా చేయకపోవడం, స్త్రీలు కంచాన్ని వడిలో పెట్టుకుని ఆరగించడం వంటివి దరిద్ర హేతువులుగా భావించాలిని చెబుతున్నారు. అలాగే, 10 మందితో కలిసి పంక్తిలో భోజనం కోసం కూర్చొన్నపుడు... భోజనం అందరూ ఆరగించేవరకు పంక్తి నుంచి లేవరాదని సూచిస్తున్నారు.
అయితే, లక్ష్మీ కటాక్షం కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచడం, ఇల్లంతా ఎంగిలి మెతుకులు పడకుండా చూసుకోవడం, కంచం చుట్టూత అన్నం మెతుకులు పడకుండా ఆరగించడం, అన్నం ఆరగించేటపుడు కంచంలో ఒక్క మెతుకు కూడా లేకుండా తినడం వంటివి లక్ష్మీ కటాక్షానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చని తెలిపారు.