చెమట వాసనతో బాధపడుతున్నారా.. నువ్వుల నూనెను రాసుకుంటే..?
కొందరికి చెమట ఎక్కువగా ఏర్పడుతుంటుంది. ఆ చెమట వాసన తొలగించుటకు ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.
కొందరికి చెమట ఎక్కువగా ఏర్పడుతుంటుంది. ఆ చెమట వాసన తొలగించుటకు ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. అవేంటో తెలుసుకుందాం.
వేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. వేపాకుతో పలు రకాలు వ్యాధులు తొలగిపోతాయి. వేపాకుల నీటితో స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఇలా చేస్తే కూడా చెమట వాసన తొలగిపోతుంది. అంటే.. వేపాకులు, తామరపువ్వులు, దానిమ్మ చెక్కలు తీసుకుని వాటిని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని గంట తరువాత ఇలా వారంలో రెండురోజులు స్నానం చేస్తే చెమట వాసన తొలగిపోతుంది. అలాకాకుంటే నువ్వుల నూనెను వారానికి ఒకసారి చర్మానికి రాసుకుని చింతపండు గింజల మిశ్రమాన్ని రాసుకుని గంట తరువాత స్నానం చేస్తే చెమట వాసన తొలగిపోతుంది.