గర్భిణులు ఉల్లిపాయను తీసుకుంటే..?
ఉల్లిపాయను వంటకాలలో ఎక్కువగా వాడుతుంటారు. దీనితో పెరుగు చట్నీలు, ఉల్లిపాయ కూరలు వంటి రకరకాల వంటలు చేసుకుంటుంటారు.
ఉల్లిపాయను వంటకాలలో ఎక్కువగా వాడుతుంటారు. దీనితో పెరుగు చట్నీలు, ఉల్లిపాయ కూరలు వంటి రకరకాల వంటలు చేసుకుంటుంటారు. ఉల్లిపాయ లేని ఇల్లు వుండదు. మరి దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. మానసిక ఒత్తిడిని తగ్గించే గుణాలు ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయి. కీళ్ళనొప్పులు వంటి సమస్యలకు ఉల్లిపాయ రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది.
కొందరికి పంటి నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఉల్లిపాయ ముక్కను పంటి మీద పెట్టుకుంటే చాలా వెంటనే ఉపశమనం కలుగుతుంది. కంటి సమస్యలకు ఉల్లిపాయ రసం తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు తరచుగా ఉల్లిపాయను తీసుకోవడం వలన వెంటనే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
గర్భిణులు వాంతులు వచ్చే సమయంలో ఉల్లిపాయ ముక్కకు ఉప్పు రాసుకుని తింటే మంచిది. ఉబ్బస వ్యాధితో బాధపడేవారు ఉల్లిపాయ రసంలో కొద్దిగా తేనె కలుపుకుని తీసుకుంటే ఉబ్బస వ్యాధి తగ్గుతుంది. నీళ్ళ విరేచనాలు బాధపడుతుంటే ఉల్లిపాయ రసాన్ని సేవిస్తే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తహీనతను తగ్గించుటకు చాలా ఉపయోగపడుతుంది.