Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరోగ్యంగా వున్నవారు రోజుకి ఎన్ని గ్లాసుల మంచినీళ్లు తాగాలి?

మన శరీరపు బరువులో 60 శాతం నీరు ఉంటుంది. నీరు రక్తంలోను, శరీరంలోని ఇతర ద్రవాలలోను కలిసి ఉంటుంది. శరీరం నుండి మలినాలు విసర్జించడంలోను నీరు ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. శరీరం నీటిని చెమట, మూత్రాల రూపంలో నష్టపోతుంది. ఈ నష్టాన్ని ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటి

ఆరోగ్యంగా వున్నవారు రోజుకి ఎన్ని గ్లాసుల మంచినీళ్లు తాగాలి?
, శనివారం, 29 సెప్టెంబరు 2018 (22:05 IST)
మన శరీరపు బరువులో 60 శాతం నీరు ఉంటుంది. నీరు రక్తంలోను, శరీరంలోని ఇతర ద్రవాలలోను కలిసి ఉంటుంది. శరీరం నుండి మలినాలు విసర్జించడంలోను నీరు ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. శరీరం నీటిని చెమట, మూత్రాల రూపంలో నష్టపోతుంది. ఈ నష్టాన్ని ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని త్రాగి భర్తీ చేయాలి. 
 
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు సుమారు 5 గ్లాసులు (1లీటరు) నీటిని త్రాగాలి. ఎండలు ఎక్కువుగా ఉన్నప్పుడు, ఎక్కువ నీరు చెమట ద్వారా నష్టమౌతుంది. కాబట్టి నీరు అవసరాలు ఎక్కువవుతాయి. నీరు సురక్షితంగా, ఆరోగ్యవంతంగా ఉండాలంటే అందులో రోగకారక క్రిములు-బ్యాక్టీరియా, పరాన్నజీవులు, వైరస్‌లు మొదలగునవి ఉండరాదు. 
 
అలాగే, క్రిమినాశకాలు, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, భారలోహాలు, నైట్రేట్లు ఎక్కువ మొత్తంలో ఫ్లోరోసిస్ జబ్బు ఎక్కువ కాలం పాటు అధిక ఫోరైడ్ కలిగిన నీటిని త్రాగటం వలన ఏర్పడుతుంది. సాధారణంగా లీటరు నీటిలో 0.5 శాతం నుండి 0.8 మి.గ్రా ఫ్లోరైడ్ మాత్రం ఉండడం క్షేమకరం. నీరు సురక్షితమైనది కానప్పుడు దాన్ని 10-15 నిముషాలుపాటు మరిగించి, శుభ్రపరుచవచ్చు.  
 
అలాచేస్తే రోగకారక క్రిములన్నీనాశనమై, తాత్కాలిక కఠినత్వం కూడా పోతుంది. కానీ మరగబెట్టడం వల్ల రసాయనిక కలుషితాలు తొలగిపోవు. ఇరవైలీటర్ల నీటిని శుభ్రపరచడానికి 500 మి. గ్రా. క్లోరిన్ మాత్రలు వాడవచ్చు. ఈ నీటిని తాగడం ద్వారా రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ఐదింటితో మరింత అందంగా మారిపోవచ్చు...