మిరపతో స్థూలకాయ సమస్య ఔట్...
ఏ వంటకం చేయాలన్నా ఉప్పు, కారం చాలా అవసరం. ఈ రెండు లేనిదే ఏ కూర లేదు. అయితే కొంతమంది కూరలలో కారానికి బదులుగా పచ్చిమిర్చిని వేసుకుంటుంటారు. కారానికి కన్నా మిరప రుచి చాలా బాగుంటుంది. ఈ మిరపతో కూరలే కాదు
ఏ వంటకం చేయాలన్నా ఉప్పు, కారం చాలా అవసరం. ఈ రెండు లేనిదే ఏ కూర లేదు. అయితే కొంతమంది కూరలలో కారానికి బదులుగా పచ్చిమిర్చిని వేసుకుంటుంటారు. కారానికి కన్నా మిరప రుచి చాలా బాగుంటుంది. ఈ మిరపతో కూరలే కాదు పచ్చళ్లు, చట్నీలు, సాంబార్ వంటి వంటకాలు కూడా తయారుచేసుకుంటారు. అంతేనా కాదు.. ఈ మిరప రుచికే కాదు.. ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.
ఈ మిరప ఘాటుకు కారణం ఇందులోని క్యాప్సైసిన్ అనే ఆల్కలాయిడ్ పదార్థమే. మిరప క్యాన్సర్ వ్యాధులను నివారిస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు హైబీపీని తగ్గిస్తాయి. మిరపలో విటమిన్ సి రక్తనాళాలు, చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మధుమేహా వ్యాధికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. మిరపలోని న్యూట్రియన్స్ స్థూలకాయాన్ని తగ్గిస్తాయి.
మిరప కారంగానే ఉంటుంది. అయినా కూడా ఇది కడుపులోని మంటను తగ్గించుటకు మంచిగా దోహదపడుతుంది. పలు రకాల గుండె వ్యాధులను నియంత్రిస్తుంది. అల్సర్‌ను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థకు చక్కగా సహాయపడుతుంది. ఆకలిని పెంచడంలో మిరపదే మెుదటి స్థానం. కనుక తప్పకుండా మిరపను ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది.