Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పచ్చి మిరపకాయ పవర్‌ ఎంతంటే..!

వంటల్లో కేవలం కారం కోసమే పచ్చిమిరపకాయని వాడతారు అనుకుంటారు చాలామంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పచ్చి మిరపకాయలోని పోషకాలు అన్నీఇన్నీ కావు. అవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. వీలైనంత వరకు ఎండుమిరప పొడిని తగ్గించి.. ప

Advertiesment
పచ్చి మిరపకాయ పవర్‌ ఎంతంటే..!
, బుధవారం, 26 సెప్టెంబరు 2018 (13:59 IST)
వంటల్లో కేవలం కారం కోసమే పచ్చిమిరపకాయని వాడతారు అనుకుంటారు చాలామంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పచ్చి మిరపకాయలోని పోషకాలు అన్నీఇన్నీ కావు. అవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. వీలైనంత వరకు ఎండుమిరప పొడిని తగ్గించి.. పచ్చి మిరపని వాడేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెపుతుంటారు.
 
పచ్చి మిరపకాయలో ‘విటమిన్‌ సి’ పుష్కలంగా దొరుకుతుంది. అరకప్పు తరిగిన పచ్చి మిరపతో కనీసం 181 మిల్లీగ్రాముల ‘సి’ విటమిన్‌ లభిస్తుంది. అంటే మన శరీరానికి ఒక రోజుకు సరిపడేంత అన్నమాట. మన ఆరోగ్యం ఎంత బాగుంది అని చెప్పడానికి - జీర్ణప్రక్రియ ఎంత చురుగ్గా ఉందనేదాని మీదే ఆధారపడి ఉంటుంది. ఆ ప్రక్రియ అత్యంత సజావుగా సాగేందుకు పచ్చి మిరపకాయలోని సుగుణాలు దోహదపడతాయి. శరీరంలోని అన్ని అవయవాలను ఉత్సాహంతో పనిచేసేలా పచ్చి మిరపకాయ సహాయపడుతుంది.
 
పట్టణాలు, నగరాల్లో ఉరుకుల పరుగుల జీవితం సహజం. ఇటువంటి ఆధునిక జీవనశైలిలో హైపర్‌టెన్షన్‌కు గురి కాని వారు చాలా అరుదు. దీన్ని అంతోఇంతో అడ్డుకుంటుంది పచ్చి మిరప. కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా చేస్తుందట. ఎముకలను పుష్టిగా ఉంచడంతోపాటు వాటికి బలాన్ని కూడా ఇస్తుంది. ఆర్థరైటిస్‌ వంటి జబ్బుల్ని దరిచేరనీయదు. ఏవైనా ప్రమాదాల వల్ల ఏర్పడేటువంటి తీవ్రగాయాల బ్లడ్‌ క్లాటింగ్‌ సమస్యని పచ్చి మిరపకాయలోని విటమిన్‌ కె నివారిస్తుంది.
 
పచ్చి మిరపకాయకి ఎర్ర రక్తకణాలను వృద్ధి చేసే గుణం కూడా ఉంది. ఇందులోని విటమిన్‌ ఎ చూపు పెరిగేందుకు సహాయపడుతుంది. తద్వారా దృష్టి లోపాలు రావు. వీటన్నిటితోపాటు రోగనిరోధకశక్తిని పెంపొందించే శక్తి దీనికుంది. చిన్నచిన్న అలర్జీలు, తుమ్ములు, దగ్గును తగ్గిస్తుంది. రుతువులు మారే క్రమంలో ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తుంది పచ్చి మిరప.
 
పచ్చి మిరపకాయ రెగ్యులర్‌గా తింటే.. వయసు రీత్యా చర్మం మీద వచ్చే ముడతలు కూడా తగ్గడంతోపాటు కొన్ని రకాల వైరస్‌ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గసగసాలతో పాయసమే కాదు.. పులావ్ కూడా చేయోచ్చు.. ఎలా..?