Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంగారకుడిపై ఆహారం పండించేందుకు.. మట్టి తయారీ.. కిలో ధర రూ.1450

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు 2013 నవంబరు 18న మావెన్‌ అనే వ్యోమనౌకను ప్రయోగించారు. అది అంగారకుడి కక్ష్యలోకి 2014 సెప్టెంబరు 21న ప్రవేశించింది. ప్రస్తుతం అంగారకుడి వాతావరణంపై మావ

Advertiesment
అంగారకుడిపై ఆహారం పండించేందుకు.. మట్టి తయారీ.. కిలో ధర రూ.1450
, సోమవారం, 1 అక్టోబరు 2018 (17:59 IST)
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు 2013 నవంబరు 18న మావెన్‌ అనే వ్యోమనౌకను ప్రయోగించారు. అది అంగారకుడి కక్ష్యలోకి 2014 సెప్టెంబరు 21న ప్రవేశించింది. ప్రస్తుతం అంగారకుడి వాతావరణంపై మావెన్ పరిశోధనలు జరుపుతోంది.


తాజాగా మావెన్ వ్యోమనౌక సెల్ఫీ తీసుకుని షేర్ చేసింది. అంగారక గ్రహంపై పరిశోధనల కోసం పంపిన వ్యోమ నౌక నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల తీసుకున్న సెల్ఫీని నాసా విడుదల చేసింది. 
 
ఈ నేపథ్యంలో అంగారకుడిపై ఆహారాన్ని పండించే మార్గాలపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా అంగారకుడిపై వున్న మట్టిని కృత్రిమంగా రూపొందించారు. ఈ మట్టికి వారు సిమ్యులెంట్‌గా నామకరణం చేశారు. అమెరికాలోని సెంట్రల్‌ ఫ్లోరిడా వర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ ప్రత్యేక పద్ధతి ద్వారా ఈ మట్టిని రూపొందించారు. 
 
అంగారకుడిపైకి నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్‌ సేకరించిన మట్టిలోని రసాయన లక్షణాల ఆధారంగా సిమ్యులెంట్‌ను తయారు చేశారు. అరుణ గ్రహంపై ఆహారాన్ని పండించే మార్గాలపై జరిపే పరిశోధనలకు..ఈ మట్టి ఎంతగానో తోడ్పడుతుందని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
భవిష్యత్‌లో అంగారకుడిపై మానవ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటే.. ఆహారం, నీరు, ఇతరత్రా నిత్యావసరాలు అవసరమని పరిశోధకులు అంటున్నారు. ఇందులో భాగంగానే అంగారకుడిపై ఆహారం పండించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నాసా పరిశోధకులు తెలిపారు. అంతేగాకుండా కిలో రూ.1450 చొప్పున ఈ మట్టిని కావలసిన వారికి సరఫరా కూడా చేస్తున్నామని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజస్థాన్‌లో బీజేపీ కేడర్ వీరంగం.. చిల్లర లేదన్నందుకు చితకబాదారు