1. మానసిక రుగ్మత ఉన్న వాళ్లకు నువ్వుల నూనెతో కాని నెయ్యితో కాని తలకు నుదుటి మీద మర్దన చేయాలి. రాత్రి పూట మర్దన చేసి ఉదయాన్నే తలస్నానం చేయాలి.
2. దగ్గినా, తుమ్మినా.. చేతుల్ని అడ్డు పెట్టుకుంటాం. అయితే ఆ తరువాత చేతుల్ని తుడిచేసుకుంటే సరిపోదు. కానీ అలా అడ్డుపెట్టుకున్నప్పుడల్లా సబ్బునీటిలో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.
3. ఒక స్పూన్ కొత్తిమీర రసానికి ఒక కప్పు మజ్జిగ చేర్చి తాగితే అజీర్ణం, వాంతులు, ఎక్కిళ్లు లాంటి సమస్యలు తగ్గుతాయి. దీనివల్ల పళ్లు, చిగుళ్లు కూడా బలంగా తయారవుతాయి.
4. క్రిములు చేతుల పైనే కాదు... నోట్లోనూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు రెండుసార్లు ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్టుతో పళ్లు తోముకోవాలి. నాణ్యమైన టూత్‌బ్రష్‌ను తీసుకోవాలి.
5. స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నవారు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక స్పూన్ తేనె తీసుకుంటే ఈ సమస్యకు మంచి ఉపసమనం కలుగుతుంది.