స్త్రీపురుషులు ఏ సమయాలలో శృంగారం చేస్తే మంచి ఫలితాలు?

శుక్రవారం, 29 మార్చి 2019 (21:06 IST)
స్త్రీ, పురుషుల సంగమం ఓ ప్రకృతి కార్యం, శృంగారంలో పాల్గొనడానికి నిర్దిష్ట సమయాలు ఉంటాయి. చాలామంది రాత్రి వేళలో శృంగారానికి మొగ్గు చూపుతారు. ఇది చాలా ఉత్తమం కూడా. రోజులోని కొన్నికొన్ని సమయాలను బట్టి స్త్రీ, పురుషుల శృంగార సామర్థ్యం ఆధారపడుతుంది. ఇది గర్భధారణపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే స్త్రీ, పురుషులు ఏ సమయాలలో శృంగారం చేస్తే మంచి ఫలితాలు కనబడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం అర్ధ రాత్రికి ముందు శృంగారంలో పాల్గొంటే మంచిదట. మరి సైన్స్ ఏమి చెబుతోందో చూద్దాం.
 
ఉదయం 6 నుండి 8 మధ్య పురుషులకు శృంగార వాంఛ ఎక్కువగా ఉండటమే కాదు, ఆ సమయంలో వారి సామర్థ్యం బాగా ఉంటుందట. ఇక్కడ మహిళల విషయంలో పూర్తి విరుద్ధం. ఉదయం 8 నుండి 10 మధ్య ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదల అవ్వడం వల్ల మహిళలకు శృంగార వాంఛ పెరుగుతుందట. కాని పురుషులలో ఈ సమయంలో శృంగార వాంఛ తగ్గుతుందట. ఇద్దరూ ఇష్టపడితే ఎంజాయ్ చేయవచ్చు. 
 
మధ్యాహ్నం 12 నుండి 2 గంటల మధ్య స్త్రీ,పురుషులు ఇద్దరూ బిజీ వర్క్‌లో ఉంటారు కాబట్టి శృంగారం చేసుకోవడానికి ఇష్టపడరు. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల మధ్య స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుందట. అంతేకాదు ఈ సమయంలో పురుషుల నుండి విడుదల అయ్యే వీర్యం కుడా నాణ్యమైనదిగా ఉంటుందట. కాబట్టి ఈ సమయంలో శృంగారం చేస్తే పిల్లలు కలిగే అవకాశం ఉంటుందట. 
 
కానీ చాలామంది స్త్రీలు ఈ సమయాన్ని ఇష్టపడరు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య స్త్రీ, పురుషుడు ఇద్దరికీ ఎక్కువగా ఆకలి వేస్తుందట. అంతేకాదు శృంగార వాంఛ, సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుందట. కాబట్టి ఈ సమయం శృంగారానికి అనువు కాదు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు ఇద్దరిలోను శక్తి నిల్వలు పెరిగి శృంగారానికి అనువుగా తయారవుతారట. 
 
కనుక ఈ సమయం శృంగారానికి అత్యంత అనువైనది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. రాత్రి 10 నుండి 12 గంటల మధ్య శృంగారం చేసుకోవడానికి చాలా అనువైనదట. ఎందుకంటే ఈ సమయంలో వారి హార్మోన్లు బాగా ఎక్కువగా పనిచేస్తాయట. అయితే మంచి నిద్ర సమయం కాబట్టి గ్రామీణ స్త్రీలు ఎక్కువగా ఆసక్తి చూపరట.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఐతే చికెన్ సూప్ తాగండి..